Pakka Commercial: ‘పక్కా కమర్షియల్‌’ విడుదల ఆరోజే .. మోహన్‌లాల్‌ ‘మరక్కర్‌’ థియేటర్లలోనే 

గోపీచంద్‌, రాశిఖన్నా జంటగా మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని ఖరారు చేసింది.

Published : 12 Nov 2021 02:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గోపీచంద్‌, రాశిఖన్నా జంటగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. చిత్ర బృందం విడుదల తేదీని తాజాగా ఖరారు చేసింది. 2022 మార్చి 18న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ సినిమాలో గోపీచంద్‌, రాశీఖన్నా లాయర్లుగా కనిపించనున్నారు. యువీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 పిక్చర్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. జాక్స్‌ బెజోయ్‌ సంగీతం అందిస్తున్నారు.

ఓటీటీలో కాదు..

మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మరక్కర్‌’. ‘అరేబియా సముద్ర సింహం’ అనేది ఉపశీర్షిక. అర్జున్‌, సుహాసిని కీర్తి సురేశ్‌, సునీల్‌ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2020 మార్చిలోనే ప్రేక్షకుల ముందుకురావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాపడింది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ముగిసిన తర్వాత ఈ ఏడాది ఆగస్టు 12న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేశారు. కానీ, అన్ని ప్రాంతాల్లో థియేటర్లని పూర్తిగా తెరవకపోవడంతో మరోసారి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ‘మరక్కర్‌’ ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలున్నాయంటూ వార్తలొచ్చాయి. వాటిల్లో నిజంలేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. డిసెంబరు 2న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ పీరియాడికల్‌ ప్రాజెక్టు విడుదలకు ముందే మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌, ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌, ఉత్తమ వస్త్రాలంకరణ విభాగాల్లో ఈ చిత్రం అవార్డులు దక్కించుకుంది.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని