Raviteja: ‘రావణాసుర’.. యాక్షన్‌ షురూ

రవితేజ హీరోగా సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రావణాసుర’. అభిషేక్‌ నామా నిర్మాత. అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్‌, పూజిత కథానాయికలు. సుశాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ సినిమా..

Updated : 19 Jan 2022 07:02 IST

వితేజ హీరోగా సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రావణాసుర’. అభిషేక్‌ నామా నిర్మాత. అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్‌, పూజిత కథానాయికలు. సుశాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ సినిమా.. ఇప్పుడు రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా సెట్లోని ఓ చిన్న వీడియోని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం చిత్ర ప్రధాన తారాగణంపై నైట్‌ సీక్వెన్స్‌ తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. రవితేజ ఈ సినిమాలో న్యాయవాదిగా కనిపించనున్నారు. రామ్‌ అనే కీలక పాత్రలో సుశాంత్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఐదుగురు కథానాయికల పాత్రలకు మంచి ప్రాముఖ్యం ఉండనుంది. దీనికి హర్ష వర్దన్‌ రామేశ్వర్‌, భీమ్స్‌ స్వరాలందిస్తున్నారు. విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని