Maa Elections: పవన్ మార్నింగ్ షో కలెక్షనంత బడ్జెట్ ఉండదు మీ సినిమా:ప్రకాశ్‌రాజ్
తాను చెప్పని మాటలను చెప్పానని సినీ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్ అబద్ధాలు ఆడుతున్నారని, ఆయన మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని
హైదరాబాద్: తాను చెప్పని మాటలను చెప్పానని సినీ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్ అబద్ధాలు ఆడుతున్నారని, ఆయన మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని ప్రకాశ్‌రాజ్ ధ్వజమెత్తారు. అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. ‘మీరు పవన్‌కల్యాణ్ వైపు ఉన్నారా? లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా’ అని మంచు విష్ణు ప్రశ్నించడం బాగోలేదని, పవన్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా? అని ప్రకాశ్‌రాజ్ ప్రశ్నించారు. ‘‘నేను తెలుగువాడిని కాదు. కర్ణాటకలో పుట్టా. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నటుడిగా ఎదిగా. అంతమాత్రాన నేను ఎన్నికల్లో పోటీ చేయకూడదని ‘మా’ నియమాల్లో ఉందా? రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నా. 9 నందులు తీసుకున్నా. అవతలి ప్యానెల్లో ఎవరైనా ఉన్నారా? దీనిపై చర్చ పెడితే జనం నవ్వుతారు. ప్రకాశ్‌రాజ్ మీద ఏదో ఒకటి చెప్పాలని విమర్శలు చేయడం తగదు. తెలుగు భాష గురించి ఏ స్థాయిలో మాట్లాడటానికైనా నేను సిద్ధమే. తెలుగు భాష మాట్లాడినంత మాత్రాన తెలుగువారు అయిపోరు. ఆత్రేయ, చలం, తిలక్ ఎవరి గురించైనా చర్చ పెడితే మాట్లాడతా.. వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు దేని గురించైనా మాట్లాడే సత్తా నాలో ఉంది. అవతలి ప్యానెల్లో ఉన్న ఒక్క సభ్యుడిలోనైనా ఉందా? దమ్ముంటే ఎన్నికల్లో దిగాలి. కృష్ణుడినవుతా. రథం ఎక్కుతా. ఈ మాటలెందుకు’’
‘‘పవన్‌కల్యాణ్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా? ఆయన ప్రసంగాన్ని విశ్లేషించాలి. మొదట ఆయన సినీ నటుడు. ఆ తర్వాతే రాజకీయ నాయకుడు. విష్ణు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. పవన్‌కల్యాణ్ మార్నింగ్ షో కలెక్షనంత లేదు మీ సినిమా బడ్జెట్. ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మీకు పొలిటికల్ అజెండా ఉంటే మీరు చూసుకోండి. పవన్ సినీ నటుడు. ఆయన రాజకీయ అజెండా మాకొద్దు. ఏపీ రాజకీయాలు నాకు తెలియవు. ఇండస్ట్రీ పరంగా పవన్ రెండు, మూడు ప్రశ్నలు అడిగారు. అవి ఏ స్వరంతో అడిగారన్న దానిపై మనం చర్చించుకుందాం. ‘మీరు పవన్‌కల్యాణ్ పక్కన ఉన్నారా? ఇండస్ట్రీ పక్కన ఉన్నారా’ అంటూ నన్నెందుకు లాగుతున్నారు. ఆయనకు నాకూ సిద్ధాంత పరంగా విభేదాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పవన్ స్వయంగా చెప్పారు. అయితే, సినిమా విషయానికొస్తే నేను నంద.. ఆయన బద్రి.. అయిపోయిందంతే. ‘మా’ ఎన్నికల్లో జగన్‌ను లాగొద్దు. ఆయన పాదయాత్ర చేసి, ప్రజల మనసు గెలుచుకుని సీఎం అయ్యారు. ‘మా’ అసోసియేషన్ గురించి ఆలోచించేంత సమయం ఆయనకు ఉండదు. కేసీఆర్ ఉద్యమం చేసి, ఒక సీఎం అయ్యారు. ఆయనకు చాలా పనులున్నాయి. ఇందులోకి వాళ్ల పేర్లు ఎందుకు లాగుతున్నారు’’ అని ప్రకాశ్‌రాజ్ తీవ్రంగా స్పందించారు.
ప్రకాశ్‌రాజ్‌కు ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంఘీభావం
నెల 10న ‘మా’ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ను హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఆయన ప్యానల్ సంపూర్ణ మెజారిటీతో గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే చిత్ర నిర్మాణాలలో స్థానిక కళాకారులకు అవకాశాలు కల్పించాలని, అందుకు ప్రకాశ్ రాజ్ తరపు నుండి పూర్తి సహకారం కావాలని వారు కోరారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ఏపీ మా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ‘‘నేను విశ్వ నటుడిగా ఉన్నా. ఏ రాష్ట్రానికో, భాషకో పరిమితం చేయవద్దు. మా ఎన్నికలకు గానూ సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రతి కార్మికుడి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండే విధంగా భవిష్యత్తు కోసం ముందుకు వెళ్తున్నాం. మనం కళాకారులం.. కళాకారులుగానే ఉందాం, జీవిద్దాం. మనకు తెలిసింది నటన ఒక్కటే. మన సంక్షేమం కోసం మనం కలిసి పని చేద్దాం’’ అని అన్నారు. అనంతరం ఏపీ మా అధ్యక్షులు ఎం. కృష్ణ కిషోర్, కార్యదర్శి వై అప్పారావ్, వ్యవస్థాపక అధ్యక్షలు ఏ.ఎం.ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శులు సిహెచ్.రమేష్ యాదవ్, పూతి వెంకటరెడ్డి, జీఎస్ కళ్యాణ్.. ప్రకాశ్రాజుకు జ్ఞాపిక అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్