MAA Elections: ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు... తొలి సంతకం ఆ ఫైల్‌ మీదే!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌పై హోరాహోరీగా పోరాడిన విష్ణు...

Updated : 13 Oct 2021 14:17 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌పై హోరాహోరీగా పోరాడిన విష్ణు భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి.. ‘మా’ సభ్యుల పింఛన్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్‌లో కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన మేనిఫెస్టోలో చర్చించిన ప్రతి విషయాన్ని రానున్న రోజుల్లో పూర్తి చేసి.. అసోసియేషన్‌ అభివృద్ధికి పాటుపడతానని ఆయన తెలిపారు. మరోవైపు ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి విజయం సాధించిన 11 మంది సభ్యులు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని