MAA Elections: ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ ఆరోపణల్లో నిజం లేదు: కృష్ణమోహన్‌

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల పోలింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ మంగళవారం సాయంత్రం ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ చేసిన ఆరోపణలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ స్పందించారు.

Updated : 13 Oct 2021 16:37 IST

పోస్టల్‌ బ్యాలెట్‌ అవకతవకలపై ఎన్నికల అధికారి స్పష్టత

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల పోలింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ మంగళవారం సాయంత్రం ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ చేసిన ఆరోపణలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ స్పందించారు. ఈ మేరకు బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడిన కృష్ణమోహన్‌.. పోలింగ్‌పై ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ చేస్తోన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పేశారు. ‘పోస్టల్‌ బ్యాలెట్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. పోలింగ్‌ రోజునే పోస్టల్‌ బ్యాలెట్లను పదవుల వారీగా వేరు చేశాం. లెక్కించినవి, లెక్కించనవి వేర్వేరు పెట్టెల్లో పెట్టాం’ అని కృష్ణమోహన్‌ వివరించారు.

ఈసారి ‘మా’ ఎన్నికలు ఎంతో ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు హోరాహోరీగా పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే అక్టోబర్‌ 10న జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు మంచి మెజారిటీతో విజయం సాధించి బుధవారం ఉదయం ‘మా’ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు