Dhee 13 Promo: ఎవరూ తగ్గొద్దు: అల్లు అర్జున్‌

‘‘ఎవ్వరూ, ఎక్కడా తగ్గొద్దు’’ అని అంటున్నారు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌. ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ షో ‘ఢీ-13’ గ్రాండ్‌ ఫినాలేకి బన్నీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌గా సాగుతోన్న ఈ షోలో

Published : 29 Nov 2021 14:54 IST

హైదరాబాద్‌: ‘‘ఎవ్వరూ, ఎక్కడా తగ్గొద్దు’’ అని అంటున్నారు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌. ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ షో ‘ఢీ-13’ గ్రాండ్‌ ఫినాలేకి బన్నీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌గా సాగుతోన్న ఈ షోలో కంటెస్టెంట్స్‌ల తుదిపోరును ఆయన వీక్షించారు. అనంతరం విజేతను ప్రకటించి.. వాళ్లకు ‘ఢీ-13’ టైటిల్‌ అందించారు. దీనికి సంబంధించిన సరికొత్త ప్రోమోని తాజాగా ‘ఢీ’ టీమ్‌ విడుదల చేసింది. తుది సమరంలో విజయం సాధిచేందుకు కంటెస్టెంట్స్ చేసిన నృత్యాలకు న్యాయనిర్ణేతలు ఈలలు వేశారు.

అనంతరం అల్లు అర్జున్‌ స్టేజ్‌పైకి ఎంట్రీ ఇవ్వగానే.. ‘బన్నీ, బన్నీ’ పిలుపులతో ఆ ప్రదేశమంతా మారుమోగిపోయింది. ‘‘ఢీ సీజన్‌-3కి ముఖ్య అతిథిగా వచ్చా. ఇప్పుడు మళ్లీ సీజన్‌ 13కి వస్తున్నా’’ అని బన్నీ చెప్పగానే.. ‘‘పదేళ్లైనా ఆ పదును తగ్గలే’’ అని ప్రదీప్‌ అన్నారు. ‘‘ఏడు నెలల క్రితం మీరు తగ్గేదేలె అన్నారు. ఆ తర్వాత ఎవర్నీ కలిసినా తగ్గేదేలే అంటున్నారు’’ అని ప్రదీప్‌ అనగానే..  ‘‘తగ్గొద్దు కూడా’’ అని బన్నీ సరదాగా రిప్లై ఇచ్చారు. మరి, తుది పోరులో ఎవరు విజయం సాధించారు? బన్నీ చేతుల మీదగా టైటిల్‌ ఎవరు అందుకున్నారు? అనేది తెలియాల్సి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని