Kota Srinivasarao: వారు లేకపోతే ఆయన నటుడు మాత్రమే: కోట శ్రీనివాసరావు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ఓడిపోవడానికి నాగబాబు, నరేశ్‌ చేసిన వ్యాఖ్యలే కారణమని సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయ...

Published : 19 Oct 2021 01:59 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ఓడిపోవడానికి నాగబాబు, నరేశ్‌ చేసిన వ్యాఖ్యలే కారణమని సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ‘మా’ ఎన్నికల వ్యవహారంపై మరోసారి స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. నాగబాబుని తాను ఎప్పుడూ ఏం అనలేదని.. అలాంటప్పుడు, తనని కించపరిచేలా ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు.

‘‘మనస్ఫూర్తిగా చెబుతున్నా చిరంజీవి మంచి నటుడు. ఆయన నటించిన సినిమాకి జాతీయ అవార్డు రాకపోతే.. మంచి నటుడు కాదని అంటామా?. అదే మాదిరిగా ప్రకాశ్‌రాజ్‌ ఎలాంటి వ్యక్తి అనేది ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రతిసారీ ‘జాతీయ అవార్డు తీసుకువచ్చా’ అని చెప్పుకున్నాడు. అలా, తీసుకువచ్చినంత మాత్రాన ఎస్వీరంగారావు కంటే ఆయన గొప్ప నటుడా? ప్రకాశ్‌రాజ్‌తో నేను కొన్ని సినిమాల్లో నటించాను. ఆయన టైమ్‌కి సెట్‌కి రాడు. తోటి నటీనటులతో చక్కగా మాట్లాడడు. ‘మా’ అసోసియేషన్‌ అతన్ని ఇప్పటికే కొన్నిసార్లు సస్పెండ్‌ చేసింది. ఇక, ఆయనకు సపోర్ట్‌గా ఉన్న నాగబాబు ఇటీవల నాపై చేసిన వ్యాఖ్యలు బాధించాయి. ప్రకాశ్‌రాజ్‌తో పోలుస్తూ నన్ను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ నాగబాబుని నేను ఏం అనలేదు. కానీ ఆయనే నన్ను విమర్శించారు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్‌కల్యాణ్‌ లేకపోతే నాగబాబు కేవలం ఒక నటుడు మాత్రమే. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత విషయం’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని