Published : 15/08/2021 23:29 IST

Indian Idol: ఇండియన్‌ ఐడల్‌ ఫైనలిస్ట్‌కి రౌడీబాయ్‌ స్పెషల్‌ గిఫ్ట్‌

హైదరాబాద్‌: సంగీత ప్రపంచంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ప్రోగ్రామ్‌ ‘ఇండియన్‌ ఐడల్‌’. ప్రస్తుతం ఈ షో 12వ సీజన్‌ జరుగుతోంది. మరికొన్ని గంటల్లో ముగియనున్న ఈ షోలో మన తెలుగింటి అమ్మాయి షణ్ముఖ ప్రియ ఫైనల్‌ స్టేజ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటలకు వరకూ అంటే నిరంతరాయంగా 12 గంటలపాటు ‘ఇండియన్‌ ఐడిల్‌ -12’ గ్రాండ్‌ ఫినాలే జరగనుంది. ఇందులో తనతోపాటు ఫినాలేలో నిలిచిన మరో ఐదుగురు కంటిస్టెంట్స్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు షణ్ముఖ ప్రియ సిద్ధమయ్యారు.

కాగా, ఎంతోమంది పోటీదారులను ఓడించి ఫైనల్‌కు చేరిన షణ్ముఖ ప్రియకు అభినందనలు తెలిపారు టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ. హోరాహోరీ సంగ్రామంలో పోటీ పడుతున్న ఆమెకు ఆల్‌ది బెస్ట్‌ చెబుతూ ఓ స్పెషల్‌ వీడియోని పంపించారు. ‘హాయ్‌ షణ్ముఖ ఎట్లా ఉన్నావ్‌? గ్రాండ్‌ ఫినాలేలో అడుగుపెట్టిన నీకు నా హృదయపూర్వక అభినందనలు. షణ్ముఖ ప్రియ స్టేజ్‌పై పాడుతున్నప్పుడు పక్కనే ఉన్న వాళ్లమ్మగారు లిప్‌ సింక్‌ ఇస్తుంటారు. అది చూసి నేను ఎంతో ఆనందిస్తుంటాను. ఈ రోజు వాళ్లిద్దరూ కలిసి స్టేజ్‌పై పాడుతుంటే చూడాలనుకుంటున్నాను. జయపజయాల గురించి పట్టించుకోకుండా కేవలం బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఇవ్వు. ఇండియన్‌ ఐడిల్‌ గెలుపొందినా లేదా ఓడినా నువ్వు హైదరాబాద్‌ వస్తావు. నన్ను కలుస్తావు. నా సినిమాలో ఓ పాట పాడతావు’ అని విజయ్‌ దేవరకొండ స్పెషల్‌ వీడియోతో షణ్ముఖను సర్‌ప్రైజ్‌ చేశారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని