Gopichand: ‘ఆరడుగుల బుల్లెట్‌’ రిలీజ్‌ ఎప్పుడంటే..!

గోపీచంద్‌, నయనతార జంటగా నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. బి.గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి...

Published : 02 Oct 2021 16:32 IST

హైదరాబాద్‌‌: గోపీచంద్‌, నయనతార జంటగా నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. బి.గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలుకారణాల వల్ల ఇంతకాలం విడుదలకు నోచుకోలేదు. మొత్తానికి చిత్రబృందం తీపి కబురు చెప్పింది. ఈ క్రమంలోనే అక్టోబర్‌ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేశ్‌ నిర్మించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని