Gamanam: గమనం పాట విన్నారా?

నటి శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘గమనం’. సుజనారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల.....

Published : 28 Nov 2021 12:45 IST

హైదరాబాద్‌: నటి శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘గమనం’. సుజనారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘గమనం’ నుంచి సాంగ్‌ ఆఫ్‌ లైఫ్‌ పేరుతో ఓ సరికొత్త పాటను నటుడు నాగచైతన్య విడుదల చేశారు. పాట చాలా బాగుందని.. తప్పకుండా ఈ సినిమా హిట్‌ కావాలని కోరుకుంటున్నట్లు చై తెలిపారు. మాస్ట్రో ఇళయ రాజా అందించిన మ్యూజిక్‌కు కైలాశ్‌ ఖేర్‌ ఆలపించిన పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకొనేలా ఉంది. భావోద్వేగభరితమైన కథాంశాలతో తెరకెక్కిన ‘గమనం’లో శ్రియ దివ్యాంగురాలి పాత్ర పోషించారు. శివ కందుకూరి, ప్రియాంక జువల్కర్‌ కీలకపాత్రలు పోషించారు. క్రియ ఫిల్మ్‌ క్రాప్‌, కాళీ ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని