Kartikeya: కార్తికేయ.. కల్యాణ సంబరం

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి లోహిత మెడలో మూడుముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. వీరి పెళ్లి వేడుక ఆదివారం ఉదయం

Updated : 22 Nov 2021 07:14 IST

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి లోహిత మెడలో మూడుముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. వీరి పెళ్లి వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి, అల్లు అరవింద్‌, తనికెళ్ల భరణి, సాయికుమార్‌, అజయ్‌ భూపతి, పాయల్‌ రాజ్‌పూత్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని.. వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం అజిత్‌తో కలిసి కార్తికేయ నటించిన ‘వాలిమై’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని