MAA Elections: ఓటు వేయని సిని‘మా’ తారలు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈసారి ‘మా’ సభ్యులు...

Updated : 10 Oct 2021 17:11 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈసారి ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఏడాది మొత్తంగా 665 మంది ఓటు వేశారు. మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్రకథానాయకులతోపాటు గిరిబాబు, చలపతిరావు, బాబుమోహన్‌, బ్రహ్మానందం వంటి సీనియర్‌ నటులు, రోజా, జయప్రద, జెనీలియా, అఖిల్‌, నాని.. ఇలా ఎంతో మంది సినీ తారలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాగా, ఎంతో హోరాహోరీగా సాగిన ‘మా’ ఎన్నికలకు పలువురు తారలు దూరంగా ఉన్నారు. ఓటు వేసేందుకు ఆసక్తి కనబర్చలేదు. విక్టరీ వెంకటేశ్‌, మహేశ్‌బాబు, తారక్‌, ప్రభాస్‌, రానా, నితిన్, నాగచైతన్య, అల్లు అర్జున్‌, శర్వానంద్‌, సునీల్‌, సుమంత్‌, సుశాంత్‌, సత్యదేవ్‌, అల్లు శిరీష్, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, రవితేజ, అనుష్క, రకుల్‌, త్రిష, హన్సిక, ఇలియానా, నిహారికతోపాటు పలువురు తారలు ఓటు వేసేందుకు హాజరు కాలేదు. అయితే, వీళ్లందరూ తమ వ్యక్తిగత కారణాలు, వరుస షూటింగ్స్‌తో ఫుల్‌ బిజీగా ఉండటంచేత కొంతమంది నటీనటులు పోలింగ్‌కు హాజరు కాలేకపోయినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని