Updated : 28/11/2021 16:06 IST

Bigg Boss Telugu 5: కాజల్‌.. రవిలలో ఎవరి కోసం సన్నీ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వాడాడు?

హైదరాబాద్‌: దాదాపు 85 రోజుల నుంచి హోరాహోరీగా తలపడి.. ప్రియమైనవారిని తలచుకుని బాధపడి.. ఇంతకాలం కాస్త కోపంగా, మరికాస్త నిరాశంగా ఉన్న బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులు ఇప్పుడు ఎన్నడూ లేనంత ఉత్సాహంతో సందడి చేస్తున్నారు. ఇంటిసభ్యులు, ప్రియమైనవారి రాకతో ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌లో వాతావరణం ఎంతో సరదాగా మారిన విషయం తెలిసిందే. చాలారోజుల తర్వాత తమ వారిని చూసి.. వారితో కొంతసమయం కేటాయించిన ఇంటి సభ్యులందరికీ ఎక్కడలేని ఆనందం వచ్చేసింది. దాంతో సండే.. ఫన్‌డేలో వారంతా రెట్టింపు ఉత్సాహంతో ఆటలు ఆడారు. నాగార్జున ఇచ్చిన ఫన్నీ టాస్క్‌లను జోష్‌తో పూర్తి చేశారు. ఇందులో భాగంగా.. ‘‘షణ్ముఖ్‌ ఎంత  ఫ్రీగా అయిపోయాడో. ఎంత సరదాగా గెంతులేస్తున్నాడో’’ అని నాగ్‌ చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు. మరి, ఇంత సరదాగా సాగుతోన్న ‘బిగ్‌బాస్‌’ గేమ్‌ నుంచి టాప్‌ 7లోకి ఎవరు అడుగుపెడుతున్నారు? ఈ వారం ఇంటి నుంచి బయటకు ఎవరు వస్తున్నారు? అనేది తెలియాల్సి ఉంది.



Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్