Cinema News: ముగిసిన బెంగాలీ చిత్రోత్సవాలు

సాంస్కృతికంగా, సాహిత్యం పరంగా తెలుగు, బెంగాలీల మధ్య బలమైన బంధం ఉందని అభిప్రాయపడ్డారు ప్రముఖ నటి మున్‌ మున్‌ సేన్‌. బెంగాలీ చిత్రాలెన్నో

Updated : 29 Nov 2021 09:01 IST

సాంస్కృతికంగా, సాహిత్యం పరంగా తెలుగు, బెంగాలీల మధ్య బలమైన బంధం ఉందని అభిప్రాయపడ్డారు ప్రముఖ నటి మున్‌ మున్‌ సేన్‌. బెంగాలీ చిత్రాలెన్నో తెలుగులో రీమేక్‌ అయ్యాయని.. భవిష్యత్తులో రెండు భాషలకి చెందిన సినిమాల మధ్య బంధం మరింత బలోపేతం కావాలని ఆమె అన్నారు. తెలుగు బెంగాలీ సమితి ఆధ్వర్యంలో అయనా - 2021 పేరుతో హైదరాబాద్‌లో మూడు రోజులపాటు చిత్రోత్సవాల్ని నిర్వహించారు. చివరి రోజైన ఆదివారం పలు బెంగాలీ, తెలుగు చిత్రాల్ని ప్రదర్శించారు. పలువురు బెంగాలీ నటులు సందడి చేశారు. ముగింపు  ఉత్సవంలో మున్‌ మున్‌ సేన్‌తోపాటు, పలువురు బెంగాలీ నటులు, తెలంగాణ ప్రభుత్వం అధికారులు, నిర్మాత ఎ.రమేష్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎ.రమేష్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘నాలుగేళ్లుగా బెంగాలీ చిత్రోత్సవాల్ని నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాదీ ఈ  ఉత్సవాలకి తన వంతు సహకారం అందిస్తాన’’న్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు జయేష్‌ రంజన్‌, సవ్యసాచి ఘోష్‌, మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని