Updated : 11/10/2021 09:23 IST

MAA Elections: ‘మా’ పీఠంపై మంచు విష్ణు

హైదరాబాద్‌: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు సినీ వర్గాల్లో చర్చకు దారితీసిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ముగిసాయి. హోరాహోరీగా సాగిన పోరులో మంచు విష్ణు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై అపూర్వ విజయం సొంతం చేసుకున్నారు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో గెలుపొందారు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి. గతకొన్ని రోజులుగా విమర్శలు, ప్రతి విమర్శలతో ఇరువర్గాలు చిత్రసీమను వేడెక్కించాయి. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో ‘మా’ సభ్యులు స్పష్టమైన తీర్పునిచ్చారు. ‘మా’ చరిత్రలోనే అత్యధిక పోలింగ్‌ నమోదైంది.‘మా’లో మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా వారిలో 665మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ప్రకాశ్‌రాజ్‌ను ఆలింగనం చేసుకొని కంటతడి పెట్టిన విష్ణు
‘మా’ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మంచు విష్ణు భావోద్వేగానికి గురయ్యారు. ప్రకాశ్‌రాజ్‌ను ఆలింగనం చేసుకొని కంటతడి పెట్టారు. ఈ గెలుపు మా నాన్నగారిది అని మంచు విష్ణు అన్నారు. ‘మా’ ఎన్నికలు ఇంత దూరం వచ్చి ఉండకూడదన్నారు. మేమంతా ఒకే కుటుంబం అని, కలిసి పనిచేస్తామని విష్ణు అన్నారు. ఇది తెలుగు నటీనటుల ఆత్మగౌరవానికి దక్కిన విజయమన్నారు.
 

జీవితపై రఘుబాబు విజయం

జనరల్‌ సెక్రటరీ పదవికోసం ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి జీవిత రాజశేఖర్‌, మంచు విష్ణు ప్యానల్‌ నుంచి రఘుబాబు పోటీపడ్డారు. ఉత్కంఠ పోరులో రఘుబాబు 7 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. వైఎస్‌ ప్రెసిడెంట్‌గా విష్ణు ప్యానల్‌ నుంచి మాదాల రవి గెలుపొందారు.

ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్‌
ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికోసం ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌, మంచు విష్ణు ప్యానల్‌ నుంచి బాబుమోహన్‌ పోటీ పడ్డారు. నువ్వా నేనా అన్నట్టు సాగిన హోరా హోరీ పోరులో శ్రీకాంత్‌ విజయం సాధించారు.  

కోశాధికారిగా శివబాలాజీ
‘మా’ కోశాధికారిగా విష్ణు ప్యానల్‌ నుంచి శివబాలాజీ విజయం సాధించారు. ప్రకాశ్‌ ప్యానల్‌ నుంచి పోటీ చేసిన నాగినీడుపై 32 ఓట్ల తేడాతో శివబాలాజీ ఆధిక్యం సాధించారు. శివబాలాజీకి 316 ఓట్లు రాగా, నాగినీడుకు 284 ఓట్లు పోలయ్యాయి.

కార్యవర్గ సభ్యులు వీరే..
మంచు విష్ణు ప్యానెల్‌లో మాణిక్, హరినాథ్ , బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత కార్యవర్గసభ్యులుగా గెలుపొందారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో అనసూయ, సురేశ్‌ కొండేటి, కౌశిక్‌, శివారెడ్డి కార్యవర్గ సభ్యులుగా గెలుపొందారు. 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని