Rajkumarrao: రాజ్‌కుమార్‌రావ్‌ నిశ్చితార్థం

బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌రావ్‌ తన ప్రియురాలు, నటి పత్రలేఖతో నిశ్చితార్థం చేసుకున్నాడు. చంఢీగర్‌లో జరిగిన ఈ వేడుకకు ఫరాహ్‌ ఖాన్‌, సఖిబ్‌ సలీమ్‌ తదితర నటీనటులు, దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు.

Updated : 15 Nov 2021 07:02 IST

బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌రావ్‌ తన ప్రియురాలు, నటి పత్రలేఖతో నిశ్చితార్థం చేసుకున్నాడు. చంఢీగర్‌లో జరిగిన ఈ వేడుకకు ఫరాహ్‌ ఖాన్‌, సఖిబ్‌ సలీమ్‌ తదితర నటీనటులు, దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. కనుల పండువగా సాగిన ఈ వేడుకలో మోకాళ్ల మీద కూర్చొని రాజ్‌కుమార్‌రావ్‌ పత్రలేఖకు రింగ్‌ ఇచ్చి ప్రపోజ్‌చేశాడు. ఈ మేరకు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చింది. వీరిద్దరూ కలిసి ‘సిటీలైట్స్‌’, ‘బోస్‌: డెడె-అలైవ్‌’ చిత్రాల్లో నటించారు. ‘నిజ జీవితంలో వివాహ బంధంతో ఒక్కటవ్వడానికి నిశ్చితార్థం సిద్ధమయ్యార’ని స్నేహితులు వారిద్దరికీ శుభాకాంక్షలు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని