Bandla Ganesh: నటుడు బండ్ల గణేశ్‌ ఉదారత.. ప్రశంసలు కురిపిస్తోన్న నెటిజన్లు!

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌పై నెట్టింట ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. ‘గణేశ్‌ది గొప్పమనసు’ అంటూ పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి.

Published : 29 Nov 2021 01:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌పై నెట్టింట ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. ‘గణేశ్‌ది గొప్పమనసు’ అంటూ పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే.. నేపాల్‌కు చెందిన ఓ చిన్నారిని గణేశ్‌ దత్తత తీసుకున్నారు. ఎవరికీ తెలియని ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘కొందరు కుక్క పిల్లల్ని, మరికొందరు ఇతర జంతువుల్ని పెంచుకుంటుంటారు. వాటి కోసం చాలా ఖర్చుపెడుతుంటారు. నాకు అది విచిత్రమనిపిస్తుంటుంది. ఈ పాపకు పాలు తప్ప మరేం ఇవ్వలేని పరిస్థితి వాళ్లమ్మది. ఆ దుస్థితి చూసి నా భార్య చలించిపోయింది. ఆ పాపను తీసుకుందామని కోరింది. అలా దత్తత తీసుకున్నా. ఈ చిన్నారి నెల వయసున్నప్పుడు మా ఇంటికి వచ్చింది. తనకు ఏలోటూ రాకుండా చూసుకోవాలనేది నా కోరిక’ అని తెలిపారు. సంబంధిత వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. అలా ఈ వీడియోలోని గణేశ్‌ మాటలు విన్నవారంతా ఆయన్ను మెచ్చుకుంటున్నారు. పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటుడిగా అలరించిన గణేశ్‌ ‘ఆంజనేయులు’తో నిర్మాతగా మారారు. ‘డేగల బాబ్జీ’ సినిమాతో హీరోగా పరిచయంకానున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని