MAA Elections: విష్ణుని ఎవరైనా డిస్టర్బ్‌ చేస్తే బాగుండదు: నరేశ్‌

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల కారణంగా గత కొన్నినెలల క్రితం తెలుగు చిత్రపరిశ్రమలో రాజుకున్న వేడి ఇంకా చల్లారలేదు. ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు ప్యానెల్‌కు సపోర్ట్‌గా నిలిచి....

Updated : 13 Oct 2021 21:11 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల కారణంగా గత కొన్నినెలల క్రితం తెలుగు చిత్రపరిశ్రమలో రాజుకున్న వేడి ఇంకా చల్లారలేదు. ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు ప్యానెల్‌కు సపోర్ట్‌గా నిలిచిన నరేశ్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా, ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యులు.. తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వాడీవేడీ ఆరోపణల మధ్య నటుడు మంచు విష్ణు బుధవారం ఉదయం ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నరేశ్‌ మాట్లాడుతూ.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు అయ్యాక కూడా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? అంటూ నరేశ్‌ ప్రశ్నించారు.

‘‘ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. తదుపరి ‘మా’ అధ్యక్షుడిగా విష్ణుకి బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉంది. ‘మా’ ఒక సేవా సంస్థ. అందరం కలిసి సమష్టిగా పనిచేద్దాం. కొత్త పాలకవర్గాన్ని ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి. విష్ణుని ఎవరైనా డిస్టర్బ్‌ చేస్తే బాగుండదు. ఎన్నికల సమయంలో అందరం కలిసి పనిచేద్దామని చెప్పి.. ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు.  మోదీ గెలిచారని కాంగ్రెస్‌ దేశం వదిలి వెళ్లిపోలేదు కదా..!  ‘మా’ సభ్యులెవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎన్నికలయ్యాక కూడా ఈ ఆరోపణలు ఎందుకు?’’ అని నరేశ్‌ కామెంట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని