Taapsee: అందంగా కనిపించడానికి ఎంతో కష్టపడ్డా: తాప్సీ
అందంగా కనిపించడం కోసం చిన్నప్పుడు తాను ఎంతో కష్టపడ్డానని నటి తాప్సీ అన్నారు. ‘తప్పడ్’, ‘హసీనా దిల్‌రుబ’, ‘బడ్ల’ వంటి విభిన్న కథా చిత్రాల్లో నటించి బీటౌన్‌లో తనకంటూ ఓ స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు....
ముంబయి: అందంగా కనిపించడం కోసం చిన్నప్పుడు తాను ఎంతో కష్టపడ్డానని నటి తాప్సీ అన్నారు. ‘తప్పడ్’, ‘హసీనా దిల్‌రుబ’ వంటి విభిన్న కథా చిత్రాల్లో నటించి బీటౌన్‌లో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్నారు ఈ తార. ప్రస్తుతం మిథాలీ రాజ్ బయోపిక్‌లో నటిస్తున్న తాప్సీ తాజాగా ఓ మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘‘నా కళ్లు పెద్దగా, చూడచక్కగా ఉండవు. సినిమాల్లో చూపించే హీరోయిన్స్‌లా నా ముక్కు సన్నగా ఉండదు. పెదవులు అందంగా కనిపించవు. ఆఖరికీ జుట్టు కూడా రింగు రింగులుగా కనిపిస్తుండేది. టీవీలో కనిపించే నటీమణులకు సైతం నాలాంటి జుట్టు ఉండదు. దాంతో ఏం చేయాలో అర్థం కాక.. సెలూన్‌కి వెళ్లి కెమికల్స్‌తో హెయిర్‌ని అందంగా చేసుకునేదాన్ని. అలా ఓ రెండుసార్లు చేయించుకున్నాక.. నాకు జట్టు రాలడం ప్రారంభమైంది. దాంతో మళ్లీ వాటి జోలికి పోలేదు. నిజం చెప్పాలంటే.. అందానికి పరిమితులుగా చెప్పుకొనే కొన్నింటికీ నేను సరిపోను. అందుకే ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను నేను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ విజయం సాధించలేకపోయాను. జీవితాన్ని ప్రేమతో జీవించాలని.. మనల్ని మనం ఇష్టపడితే తప్పకుండా బాహ్యప్రపంచానికి ఎంతో అందంగా కనిపిస్తామని అర్థమైంది. అప్పటి నుంచి అందంపై నా అభిప్రాయం మారింది’’ అని తాప్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్