‘ఊ అంటావా..’ లిరిక్స్‌ హార్ష్‌గా ఉన్నాయని తెలుసు.. అయినా ఎందుకు పాడానంటే?: సింగర్‌

అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్రంలో నటి సమంత నర్తించిన ‘ఉ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’కు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది.

Published : 22 Jan 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్రంలో నటి సమంత నర్తించిన ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావ’కు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ పాట యూట్యూబ్‌ ‘టాప్‌ 100 మ్యూజిక్‌ వీడియోస్‌ గ్లోబల్‌’ లిస్ట్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం ఐదు భాషల్లో ఈ గీతాన్ని విడుదల చేయగా.. హిందీ వెర్షన్‌ను కనికా కపూర్‌ ఆలపించారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన విషయాలను ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

‘‘ఈ పాటకు ఎంత క్రేజీ రెస్పాన్స్‌ వచ్చిందో అదే స్థాయిలో విమర్శలూ వచ్చాయి. ఈ పాట మాకు ఏమాత్రం నచ్చలేదంటూ ఒకరిద్దరు నాకు మెసేజ్‌ చేశారు. దానికి ‘ఓకే’ అని రిప్లై ఇచ్చా. నిజానికి పాట లిరిక్స్‌ కాస్త పరుషంగా ఉన్నాయని నాకూ తెలుసు. అమ్మాయిల కళ్లు, పెదాలు, హిప్స్‌.. మీదే ఎక్కువగా పాటలు రాస్తుంటారు. అలాంటిది మగాళ్ల మీద అలాంటి పాట ఎందుకు చేయకూడదు చెప్పండి? అదంతా సినిమాలోని కాన్సెప్ట్‌లో భాగంగా ఉన్నదే. అందుకే మేకర్స్‌ అలా చేశారు’’ అని కనికా కపూర్‌ అన్నారు. ఈ పాట హిందీ వెర్షన్‌.. యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ సుమారు 100 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని