Rashmika: విజయ్‌తో ఉన్న రిలేషన్ బయటపెట్టిన భామ
టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మిక మందనా పెయిర్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో ఆన్‌స్క్రీన్‌పై వీళ్లిద్దరి కెమిస్ట్రీకి సినీ ప్రియులు మనసు పారేసుకున్నారు.....
రౌడీబాయ్‌తో దిగిన స్పెషల్ ఫొటో షేర్ చేసిన రష్మిక
హైదరాబాద్: టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మిక మందనా జంటకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో వీళ్లిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి సినీ ప్రియులు మనసు పారేసుకున్నారు. విజయ్-రష్మిక రిలేషన్లో ఉన్నారంటూ పలు సందర్భాల్లో వార్తలు రావడం.. వాళ్లిద్దరూ వాటిని సున్నితంగా తిరస్కరించడం కూడా జరిగింది. కాగా.. తాజాగా ఆమె అభిమానులతో ఇన్‌స్టాలో ముచ్చటించారు. విజయ్ దేవరకొండతో తనకున్న రిలేషన్ షిప్ గురించి స్పందించారు.
ఫిట్‌గా ఉండడం.. హావభావాలు పలికించడం.. ఈ రెండింటిలో ఒక హీరోయిన్‌కి ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీ ఏమిటి?
ఒక నటిగా రాణించాలంటే హావభావాలు పలికించడం లేదా ఫిట్‌గా ఉండడం కంటే ముఖ్యంగా మంచి మనస్సున్న మనిషై ఉండాలి.
మీరు ఇప్పుడు ఏ సినిమాలో నటిస్తున్నారు?
ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాను. లాక్డౌన్ అనంతరం ఇటీవలే ఆ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇప్పుడు ఆ సెట్లోనే ఉన్నాను.
అందరూ మిమ్మల్ని నేషనల్ క్రష్ అని అంటుంటారు.. దాని గురించి మీరు ఎలా ఫీలవుతున్నారు?
నేషనల్ క్రష్ అంటూ నన్ను అడ్రస్ చేయడం నాకెంతో నచ్చింది. ‘నేషనల్ క్రష్’ని నేను స్వాగతిస్తున్నాను.
మీకు ఎన్ని భాషలు వచ్చు?
నా మాతృభాష కన్నడ. సినిమాల్లో నటించడం వల్ల మొత్తం ఆరు భాషలు నేర్చుకున్నాను.
విజయ్ దేవరకొండతో దిగిన ఫొటోల్లో మీకు బాగా నచ్చిన పిక్?
‘డియర్ కామ్రేడ్’ సమయంలో విజయ్‌తో దిగిన ఫొటో ఇది. కొచ్చిలో జరిగిన ఆ సినిమా మ్యూజిక్ ఫెస్టివల్లో తీసుకున్న ఈ ఫొటో నాకెంతో ఇష్టం.
మీలాంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నేను ఏం చేయాలి?
మీరు మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేని ఓ సాధారణ వ్యక్తిగా కనిపించాలి.
మీరు ఎప్పుడూ ఇంత పాజిటివ్‌గా ఉండడానికి కారణమేమిటి?
నా తల్లిదండ్రులు, చెల్లి, ఫ్రెండ్స్, ముఖ్యంగా అభిమానులు.. వీళ్లందరి వల్లే నేను ఎంతో ఎనర్జిటిక్, పాజిటివ్‌గా ఉండగలుగుతున్నాను.
విజయ్ దేవరకొండ మీకు ఎంత స్పెషలో చెప్పగలరు?
విజయ్ అంటే నాకెంతో ఇష్టం. మేమిద్దరం మంచి స్నేహితులం. విజయే నా బెస్ట్ ఫ్రెండ్.
ఇప్పటివరకూ మీరు ఎన్నిసార్లు సిగరెట్ కాల్చారు?
నాకు ధూమపానం అంటే నచ్చదు. అలాగే ధూమపానం చేసేవాళ్లకు నేను దూరంగా ఉంటాను.
అల్లు అర్జున్ గురించి ఏమైనా చెప్తారా?
అల్లు అర్జున్‌తో కలిసి నేను ‘పుష్ప’లో నటిస్తున్నాను. ఆయనతో కలిసి నటించడం ఎంతో బాగుంది. కెమెరా వెనుక ఎంతో సరదాగా ఉండే వ్యక్తి. ఒక్కసారి క్యారెక్టర్లోకి అడుగుపెట్టగానే.. ప్రొఫెషనల్‌గా మారిపోతారు. ఆయన మంచి నటుడు, అద్భుతమైన డ్యాన్సర్. ఆయనతో వర్క్ చేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నా.
మేడమ్.. ఏదైనా సాధించాలని ప్రయత్నం చేసినప్పటికీ ‘ఇది మన వల్ల కాదు’ అనే ఒక నెగెటివ్ ఫీల్ వస్తుంది.. దాని నుంచి ఎలా బయటపడాలి?
ఎప్పుడూ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి... జీవితంలో ఏదీ అంత ఈజీగా రాదు. ఎల్లప్పుడూ మనల్ని మనం ప్రోత్సహించుకుంటూనే ఉండాలి. కష్టపడుతూనే ఉండాలి.
కోలీవుడ్ హీరో విజయ్ గురించి..?
ఆయనంటే నాకు ఎంతో ఇష్టం. ఒక అభిమానిగా ఆయన్ని నేను ప్రేమిస్తున్నాను.
దేవుడు ఏదైనా వరమిస్తే ఏం కోరుకుంటారు?
భూమ్మీద ఉన్న మనుషుల జీవితాల్లోనుంచి కష్టాలు, కన్నీళ్లు, బాధలు తీసేయమని కోరుకుంటాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్‌తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.