nagarjuna: అదంతా అవాస్తవం.. నేను అలా మాట్లాడలేదు: నాగార్జున

సమంత-నాగచైతన్యల విడాకులపై తాను ఎలాంటి వ్యాఖ్యాలు చేయలేదని అగ్ర కథానాయకుడు నాగార్జున అన్నారు.

Updated : 27 Jan 2022 18:29 IST

హైదరాబాద్‌: సమంత-నాగచైతన్యల విడాకులపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అగ్ర కథానాయకుడు నాగార్జున అన్నారు. మొదట సమంతనే విడాకులు కావాలని కోరిందంటూ ఓ ఇంటర్వ్యూలో నాగార్జున అన్నారని ఉదయం నుంచి ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై నాగార్జున ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘నాగచైతన్య-సమంత గురించి నేను మాట్లాడినట్లు సోషల్‌మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నేను మాట్లాడినట్లు జరిగిన ప్రచారం అవాస్తవం. దయచేసి అవాస్తవాలను ఎవరూ ప్రసారం చేయొద్దు. పుకార్లను వార్తలుగా మల్చవద్దని మీడియాకు నా విజ్ఞప్తి’’ అని నాగార్జున పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని