Published : 17/09/2021 19:39 IST

Bollywood: ‘లాల్‌ సింగ్‌..’కి గుమ్మడికాయ్‌ కొట్టేశారు!

ముంబయి: ఆమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘లాల్‌ సింగ్‌ చద్దా’ షూటింగ్‌ శుక్రవారంతో పూర్తయింది. కరీనా కపూర్‌, అక్కినేని నాగచైతన్య ఇందులో కీలక పాత్రలు పోషించారు. కామెడీ- డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. షూటింగ్‌ ఆఖరిరోజున ఆమిర్‌ఖాన్‌, చిత్రబృందంతో కేక్‌ కట్‌ చేస్తూ సందడి చేశారు. హీరోయిన్‌ కరీనా కపూర్‌ ‘లాల్‌ సింగ్‌’ తనకెంతో ప్రత్యేమని గతంలో పంచుకున్నారు.

‘‘లాల్‌ సింగ్‌ చద్దా షూటింగ్‌ వేళ ఎన్నో సమస్యలు ఒకేసారి వచ్చిపడ్డాయి. మహమ్మారి కరోనా ఉండటం, నేను రెండోసారి గర్భం దాల్చడం.. దీంతో ఒకింత భయానికి గురయ్యా. అయితే ఇవేవీ షూటింగ్‌ పై నాకున్న ఆసక్తిని ఆపలేదు. ఇక చిత్రీకరణ జరిగేంత వరకూ జాగ్రత్త చర్యలు పాటించాం’’ అని అభిమానులతో పంచుకున్నారు. నాగచైతన్య సైతం బాలీవుడ్‌లో ఈ చిత్రంతోనే తెరంగేట్రం చేయబోతున్నారు. దేశ సరిహద్దు లద్దాఖ్‌తో పాటు ఇందులోని కొన్ని కీలక సన్నివేశాలను తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చిత్రీకరించడం విశేషం. 1994 హాలీవుడ్‌లో విజయవంతమైన ‘ఫారెస్ట్‌ గంప్‌’కి ఇది రీమేక్‌గా రూపొందుతోంది. ఆస్కార్ విజేత టామ్ హాంక్స్ ప్రధాన పాత్రలో నటించారు. ‘లాల్ సింగ్ చద్దా’ 2019 అక్టోబర్ 31న చంఢీగఢ్‌లో ప్రారంభమైంది. కొవిడ్ మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్‌ 2020 మార్చిలో నిలిపివేశారు. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సినిమా చూడాలంటే 2021 క్రిస్మస్‌ వరకూ ఆగాల్సిందే!

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని