Kaikala Satyanarayana: ఏపీ సీఎం జగన్‌కు నటుడు కైకాల సత్యనారాయణ లేఖ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ గురువారం ఉదయం లేఖ రాశారు. ఇటీవల తాను అనారోగ్యానికి గురైన సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచిన జగన్‌కు....

Updated : 20 Jan 2022 11:22 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ గురువారం ఉదయం లేఖ రాశారు. ఇటీవల తాను అనారోగ్యానికి గురైన సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచిన జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఆయన చూపించిన ప్రత్యేక శ్రద్ధ తనకెంతో మానసిక ధైర్యాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ‘‘ఇటీవల అనారోగ్యంతో నేను ఆస్పత్రిలో చేరిన వేళ.. మీరు నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. బిజీ షెడ్యూల్‌ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా నాకు ఫోన్‌ చేసి ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా సాయం చేస్తానని చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే మీ అధికారులను మా వద్దకు పంపించి సాయం చేశారు. అంతేకాకుండా వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు చూపించిన చొరవ నాకు, నా కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని అందించింది. నటీనటుల సంక్షేమం కోసం మీరు చూపే చొరవ మరోసారి ఈ విధంగా నిరూపితమైంది’’ అని లేఖలో కైకాల సత్యనారాయణ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని