మరొకరి స్థానంలో జయం విలన్‌గా
కొన్ని చిత్రాల్లో కథానాయకుడి పాత్ర ఎంత ప్రభావం చూపుతుందోప్రతినాయకుడి పాత్రా అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది. ఇలాంటి పాత్రే జయం సినిమాలో గోపీచంద్ పోషించింది.
ఇంటర్నెట్ డెస్క్ :కొన్ని చిత్రాల్లో కథానాయకుడి పాత్ర ఎంత ప్రభావం చూపుతుందో ప్రతినాయకుడి పాత్రా అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది. ఇలాంటి పాత్రే జయం సినిమాలో గోపీచంద్ పోషించింది. వెంకట్ చెయ్యి గుర్తు అంటూ నితిన్ తన ప్రేమ కోసం చేసిన పోరాటాన్ని తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేరు. గోపీచంద్.. నాయిక సదా బావగా రఘు పాత్రలో విలనిజం పండించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు . ముందుగా ఈ విలన్ రోల్ కోసం బాలీవుడ్ నటుడ్ని ఎంపిక చేశారు దర్శకుడు తేజ. అతనిపై రెండు మూడు రోజులు చిత్రీకరణ జరిపారు. కానీ తేజ అనుకున్నట్టు అతను నటించలేకపోయాడు. దాంతో మరొకరి కోసం అన్వేషిస్తుండగా తేజ అసిస్టెంట్ ఒకరు గోపీచంద్ పేరుని సూచించారు . ఓ రోజు గోపీచంద్‌కి ఫోన్ చేసి ఆడిషన్‌కి రమ్మన్నారు తేజ. వెంటనే కార్యాలయానికి వెళ్లిన గోపీచంద్‌కి హెయిర్ స్టైల్ చేయించి, పాత్రకు సరిపోతావు అని చెప్పి మరుసటి రోజు షూటింగ్లో పాల్గొనమన్నారు తేజ. అలా జయం అవకాశం గోపీచంద్‌కి వచ్చింది. తన కెరీర్‌నే ఓ మలుపు తిప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. -
ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. -
ఈ వేసవిలో బాగా నవ్విస్తాం: అల్లరి నరేశ్
పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? -
డైరెక్టర్స్ డేని ఘనంగా నిర్వహిస్తాం
‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. -
గురిపెట్టిన సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. -
రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
మహేశ్‌బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్‌తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్‌కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్‌లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్‌లో చూసుకుందాం.. లఖ్‌నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?