అక్కడ థియేటర్‌ ఓపెన్‌ చేస్తున్నారు!

రోనా వైరస్‌ ప్రభావం వినోద రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రపంచదేశాలు లాక్‌డౌన్‌ పాటించడంతో థియేటర్లు మూతపడగా, షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో

Published : 14 May 2020 20:30 IST

దుబాయ్‌: కరోనా వైరస్‌ ప్రభావం వినోద రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రపంచదేశాలు లాక్‌డౌన్‌ పాటించడంతో థియేటర్లు మూతపడగా, షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎలా షూటింగ్‌లు ప్రారంభించాలి? థియేటర్లు ఎలా ఓపెన్‌ చేయాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మల్లగుల్లాలు పడుతుంటే దుబాయ్‌లోని ఓ థియేటర్‌ మాత్రం త్వరలోనే తాము సినిమాలను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. భౌతిక దూరంపాటిస్తూనే సినిమాను ఎంజాయ్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

దుబాయ్‌లోని వోక్స్‌ సినిమాస్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ ఇందుకు వేదిక కానుంది. అయితే, సినిమా చూసేందుకు వచ్చే వాళ్లు తమ సొంత వాహనాన్ని తీసుకుని రావాలి. అందులో కేవలం ఇద్దరు మాత్రమే ఉండాలి. అప్పుడే సినిమా చూసేందుకు అనుమతి ఇస్తారు. ఇంతకీ టికెట్ల ధర ఎంతో తెలుసా? 180దిర్హామ్‌లు. అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 3,700. ఇందులోనే పాప్‌కార్న్‌, స్నాక్స్‌, డ్రింక్స్‌  కూడా ఇస్తారు. ఒకసారి 75 కార్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ ఆలోచన సక్సెస్‌ అయితే, ప్రపంచవ్యాప్తంగా ఓపెన్‌ ఎయిర్ థియేటర్లు పెరిగే అవకాశం ఉంది.

‘భౌతిక దూరం పాటిస్తూ, దీన్ని అమలు చేయడం ఒక మంచి ఆలోచన అని నా అభిప్రాయం’ అని ప్రీ ఓపెనింగ్‌ ఈవెంట్‌కు వచ్చిన జేవియర్‌ అనే వ్యక్తి అభిప్రాయపడ్డాడు. రంజాన్‌ నేపథ్యంలో ఇప్పటికే దుబాయ్‌లో పరిమితంగా రెస్టారెంట్లు, మాల్స్‌ ఓపెన్‌చేశారు. వాటిలోనూ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. 3-12 సంవత్సరాల  వయసు కలిగిన పిల్లలు, 60ఏళ్లు దాటిన వాళ్లు షాపింగ్‌ మాల్స్‌కు రావడం నిషిద్ధం. అవుట్‌డోర్‌ సినిమాకు ఇది వర్తిస్తుంది. యూఏఈలో ఇప్పటివరకూ 20,386మంది కరోనా బారిన పడగా, 206మంది మృత్యువాత పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని