‘సీటీమార్‌’ అంటున్న గోపీచంద్‌

టాలీవుడ్‌ కథానాయకుడు గోపీచంద్‌.. సంపత్‌నంది దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గోపీచంద్‌ కోచ్‌గా కనిపించనున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చిత్రబృందం నేడు సోషల్‌మీడియా....

Published : 27 Jan 2020 10:41 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ కథానాయకుడు గోపీచంద్‌.. సంపత్‌నంది దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గోపీచంద్‌ కోచ్‌గా కనిపించనున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం నేడు సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘సీటీమార్‌’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గోపీచంద్‌కు జంటగా మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తున్నారు. ఇప్పటికే సంపత్‌నంది-గోపీచంద్‌ కలయికలో ‘గౌతమ్‌నంద‌’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. 2017లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీంతో ‘సీటీమార్‌’ సినిమాతో మంచి విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఇటు గోపీచంద్‌తోపాటు అటు దర్శకుడు సంపత్‌ నంది కూడా భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన ‘చాణక్య’ సినిమాలో గోపీచంద్‌ రా ఏజెంట్‌గా కనిపించారు. తిరు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గోపీచంద్‌కు జంటగా మెహరీన్‌ నటించారు. 2019లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు లభించాయి. దీంతో ‘సీటీమార్‌’ సినిమాతో హిట్‌ కొట్టాలనుకుంటున్నారు ఈ హీరో.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని