Sonal Chauhan: నొప్పిని భరిస్తూనే.. శిక్షణ తీసుకున్నా!
‘‘యాక్షన్ పాత్రలు చేయాలన్నది నా కల. అది ‘ది ఘోస్ట్’తో నెరవేరింది. ఈ సినిమా చూశాక.. నేను గ్లామరస్ పాత్రలే కాకుండా వైవిధ్యమైన పాత్రలూ పోషించగలనే నమ్మకం అందరికీ కలుగుతుందని భావిస్తున్నా’’ అంది నటి సోనాల్ చౌహాన్. ఇటీవలే ‘ఎఫ్3’తో నవ్వులు పంచిన ఈ అమ్మడు..
‘‘యాక్షన్ పాత్రలు చేయాలన్నది నా కల. అది ‘ది ఘోస్ట్’తో (The Ghost) నెరవేరింది. ఈ సినిమా చూశాక.. నేను గ్లామరస్ పాత్రలే కాకుండా వైవిధ్యమైన పాత్రలూ పోషించగలనే నమ్మకం అందరికీ కలుగుతుందని భావిస్తున్నా’’ అంది నటి సోనాల్ చౌహాన్ (Sonal Chauhan). ఇటీవలే ‘ఎఫ్3’తో నవ్వులు పంచిన ఈ అమ్మడు.. ఇప్పుడు ‘ది ఘోస్ట్’తో థ్రిల్ చేసేందుకు సిద్ధమైంది. నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. ఈ సినిమా అక్టోబరు 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది సోనాల్.
‘‘నా తొలి ప్రాధాన్యత ఎప్పుడూ తెలుగు చిత్రసీమకే. ఈ పరిశ్రమపై నాకెంతో ప్రేమ ఉంది. తెలుగుకు నేనేమీ దూరం కాలేదు. కొవిడ్ పరిస్థితుల వల్లే విడుదల కావాల్సిన చిత్రాలు ఆలస్యమయ్యాయి. ఇకపై వరుస సినిమాలతో సందడి చేస్తా’’.
తుపాకులతో ఆడిషన్..
‘‘యాక్షన్ పాత్రలు చేయాలన్నది నా కోరిక. ఈ తరహా పాత్రల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. అందుకే దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ యాక్షన్ కథ వినిపించగానే నాకు చాలా సంతోషమనిపించింది. దీనికి తోడు నాగార్జున వంటి స్టార్‌తో తెర పంచుకునే అవకాశం కావడంతో నా ఆనందం రెట్టింపయ్యింది. అందుకే ఈ కథ వినగానే ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా వదులుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నా. స్క్రిప్ట్ వినిపించాక ప్రవీణ్ సర్ ఆడిషన్ కోసం నన్ను తన ఆఫీస్‌కు పిలిపించారు. లోపలికి వెళ్లి చూస్తే.. ఆయన ఎదురుగా ఉన్న టెబుల్‌పై బోలెడన్ని తుపాకులున్నాయి. దేని గురించి ఈ మీటింగ్ అనుకున్నా. తర్వాత ఆ గన్స్ పట్టుకొని స్టిల్స్ ఇవ్వమంటే.. చూపించాను. ఆయన రెండు నిమిషాలు చూసి.. ఓకే అనేశారు. నేనెప్పటికీ మర్చిపోలేని ఆడిషన్ ఇది. ఈ చిత్రంతో నాగార్జునతో కలిసి పనిచేయాలన్న కోరిక కూడా నెరవేరింది. మళ్లీ అవకాశమొస్తే ఆయనతో మంచి రొమాంటిక్ సినిమా చేయాలని ఉంది’’.
మనసు అంగీకరించలేదు
‘‘యాక్షన్ ప్రధానంగా సాగే థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో నేను ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా కనిపిస్తా. శారీరకంగా ఎంతో సవాల్‌తో కూడుకున్న పాత్రిది. కానీ, నటిగా నాకెంతో సంతృప్తినిచ్చింది. ఈ పాత్ర కోసం నేను మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో, గన్స్ ఉపయోగించడంలో రెండు నెలలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. అయితే నా శిక్షణ మొదలైన రెండో రోజే నా కాలు వేలు విరిగింది. మొదట నేనిది చిన్న గాయమే అనుకున్నా. ఎక్స్‌రే తీయిస్తే.. వేలు విరిగిందని చెప్పారు. డాక్టర్ కచ్చితంగా ఆరు వారాల వరకు విశ్రాంతి తీసుకోవాలన్నారు. కానీ, నా మనసు అంగీకరించలేదు. నేనెంతో ఎదురు చూసిన యాక్షన్ పాత్రిది. ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశం చేజార్చుకోకూడదనిపించింది. అందుకే నొప్పిని భరిస్తూనే శిక్షణ కొనసాగించి పాత్ర కోసం సిద్ధమయ్యా’’.
‘ఆదిపురుష్’.. కొత్త మార్పులకు నాంది
‘‘ప్రభాస్‌కు నేను వీరాభిమానిని. ఇప్పుడాయనతో కలిసి ‘ఆదిపురుష్’ చిత్రం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమా చేయడమంటే చరిత్రలో నేనూ ఓ భాగం కావడమే. దీంట్లో నా పాత్రేంటన్నది నేనిప్పుడే చెప్పలేను కానీ, ఈ సినిమా సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఫిల్మ్ మేకింగ్ టెక్నాలజీ పరంగా సరికొత్త మార్పులకు నాంది పలుకుతుంది. ప్రస్తుతం రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తా’’.
ఇంటి నుంచి బయటకు రావడమే గొప్ప..
‘‘నేను సంప్రదాయ రాజ్‌పూత్ కుటుంబం నుంచి వచ్చాను. నాకెలాంటి సినిమా నేపథ్యం లేదు. నటన మాట పక్కకు పెడితే.. మాకు ఇంటి నుంచి బయటకు రావడమే చాలా గొప్ప. నాకు ఏమీ తెలియని రోజుల్లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టా. ప్రతిదీ ఇక్కడే నేర్చుకున్నా. జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటిని ఎలా తీసుకోవాలో కూడా ఈ పరిశ్రమే నేర్పించింది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రేమ పెళ్లికే తాను ఓటు వేస్తానని చెప్పారు. -
దక్షిణాది నటీనటులకేం తక్కువ.. సౌత్ వర్సెస్ నార్త్పై ప్రియమణి కామెంట్స్
దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ రాణిస్తున్నారని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!