Samantha: మరో ప్రత్యేక గీతంలో?

ఉ అంటావా మావా... అంటూ సమంత చేసిన ప్రత్యేక సందడి కుర్రకారుని ఊపేస్తోంది. మరోసారి ఆమెని ఆ తరహా గీతంలో చూపించే ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. సమంత తొలిసారి ప్రత్యేక   గీతంలో ఆడిపాడింది ‘పుష్ప’లోనే.

Updated : 24 Jan 2022 07:05 IST

ఉ అంటావా మావా... అంటూ సమంత చేసిన ప్రత్యేక సందడి కుర్రకారుని ఊపేస్తోంది. మరోసారి ఆమెని ఆ తరహా గీతంలో చూపించే ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. సమంత తొలిసారి ప్రత్యేక   గీతంలో ఆడిపాడింది ‘పుష్ప’లోనే. తొలి గీతమే  సంచలనాలు సృష్టించడంతో సమంతని మళ్లీ ఆ తరహా పాటల్లో చూపించేందుకు తహతహలాడుతున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఓ యువ కథానాయకుడు చేస్తున్న సినిమా కోసం సమంతని  సంప్రదించారని తెలిసింది. మరి ఆమె పచ్చజెండా ఊపుతుందా లేదా? అనేది తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని