Kotha Kothaga: నా డైమండ్‌ రాణీవే..!

అజయ్‌, వీర్తి వఘాని జంటగా హనుమాన్‌ వాసంశెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొత్త కొత్తగా’. మురళీధర్‌ రెడ్డి ముక్కర నిర్మాత. శేఖర్‌ చంద్ర స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘‘నా డైమండ్‌ రాణీవే.. నీ బాయ్‌ఫ్రెండ్‌ కానీవే’’ అనే పాటను దర్శకుడు మారుతి శుక్రవారం విడుదల చేశారు. ఈ గీతానికి కాసర్ల శ్యామ్‌ సాహిత్య  మందించగా..

Updated : 07 Dec 2022 19:26 IST

అజయ్‌, వీర్తి వఘాని జంటగా హనుమాన్‌ వాసంశెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొత్త కొత్తగా’. మురళీధర్‌ రెడ్డి ముక్కర నిర్మాత. శేఖర్‌ చంద్ర స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘‘నా డైమండ్‌ రాణీవే.. నీ బాయ్‌ఫ్రెండ్‌ కానీవే’’ అనే పాటను దర్శకుడు మారుతి శుక్రవారం విడుదల చేశారు. ఈ గీతానికి కాసర్ల శ్యామ్‌ సాహిత్య  మందించగా.. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ‘‘కొత్తదనం నిండిన మంచి ప్రేమ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకి కూర్పు: ప్రవీణ్‌ పూడి, ఛాయాగ్రహణం: వెంకట్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని