Published : 06/12/2021 02:00 IST

నన్నే మార్చేశావా నువ్వూ...

‘‘నా కోసం మారావా నువ్వూ... లేక నన్నే మార్చేశావా నువ్వూ...’’ అంటూ ప్రేమగా ప్రశ్నించిన ఓ అబ్బాయికి బదులుగా తన ప్రేయసి నుంచి ఎలాంటి సమాధానం తిరిగొచ్చిందో తెలియాలంటే ‘బంగార్రాజు’ చూడాల్సిందే. నాగార్జున, నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న చిత్రమిది. విజయవంతమైన ‘సోగ్గాడే చిన్నినాయనా’కి కొనసాగింపుగా రూపొందుతోంది. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ‘నా కోసం మారావా నువ్వూ...’ అంటూ సాగే ఈ చిత్రంలోని పాటకి సంబంధించిన వీడియోని ఆదివారం విడుదల చేశారు. ‘‘కొత్తగా నాకేమయ్యిందో... వింతగా ఏదో మొదలయ్యిందో... అంతగా నాకర్థం కాలేదే... ’’ అంటూ మొదలయ్యే ఈ పాటకి బాలాజీ సాహిత్యం అందించగా, సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరకర్త. ‘‘తొలి పాట ‘లడ్డుండా...’కి విశేషమైన స్పందన లభించింది. రెండో గీతంగా విడుదలైన ఈ పాట మంచి మెలోడీతో, వినగానే గుర్తుండిపోయేలా సాగుతుంది. విడుదలైన వెంటనే చక్కటి స్పందన లభించింది. ‘మనం’ తర్వాత నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ  వేగంగా సాగుతోంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. చలపతిరావు, రావు రమేష్‌, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్‌, ఝాన్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: యువరాజ్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని