సఖి.. మరోసారి వెనక్కి

కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో నటించిన క్రీడా నేపథ్య చిత్రం ‘గుడ్‌లక్‌ సఖి’. నగేష్‌ కుకునూర్‌ తెరకెక్కించారు. ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాని..

Updated : 06 Dec 2021 05:28 IST

కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో నటించిన క్రీడా నేపథ్య చిత్రం ‘గుడ్‌లక్‌ సఖి’. నగేష్‌ కుకునూర్‌ తెరకెక్కించారు. ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాని.. డిసెంబర్‌ 31కి వాయిదా వేసింది చిత్ర బృందం. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘‘ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము చాలా కష్టపడుతున్నాం. అనుకోని సమస్యల వల్ల డిసెంబర్‌ 31కి వాయిదా వేయవలసి వచ్చింది’’ అని నిర్మాతల్లో ఒకరైన శ్రావ్య వర్మ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాలో.. కీర్తి సురేష్‌ షూటర్‌గా కనిపించనుంది. ఆమెకు శిక్షణ ఇచ్చే కోచ్‌ పాత్రను జగపతిబాబు పోషించారు. ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటించారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించగా.. సుధీర్‌చంద్ర పదిరి నిర్మించారు. దిల్‌ రాజు సమర్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని