పండగలా సేవ

కుల మతాలకు  అతీతంగా మా స్వచ్ఛంద సంస్థ నుంచి సేవలు అందిస్తామన్నారు ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల. భారతదేశంలోని ముఖ్యమైన పండగల సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తామని ఆమె తెలిపారు....

Published : 06 Dec 2021 01:59 IST

కుల మతాలకు  అతీతంగా మా స్వచ్ఛంద సంస్థ నుంచి సేవలు అందిస్తామన్నారు ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల. భారతదేశంలోని ముఖ్యమైన పండగల సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తామని ఆమె తెలిపారు. ఫెస్టివల్స్‌ ఫర్‌ జాయ్‌ పేరుతో సుమ స్వచ్ఛంద సేవా సంస్థని స్థాపించారు. దసరా సందర్భంగా ప్రారంభమైన ఆ సంస్థ ప్రజ్వల సేవా సంస్థ సంరక్షణలో ఉన్న పది మంది మహిళల జీవనోపాధి కల్పించడానికి ఆర్థిక సాయం, అక్కడే ఉంటున్న పిల్లలు ఆడుకోవడానికి ఒక ఉద్యానవనం ఏర్పాటు చేశారు. ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకి నిత్యావసరాలు, ఔషధాలు అందించారు. క్రిస్మస్‌ పండగని పురస్కరించుకుని గ్రేస్‌ ఫౌండేషన్‌, తానా సహకారంతో ఆదివారం హైదరాబాద్‌లో 250 మందికి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ పది మందికి సేవ చేయడంలో పండగలాంటి ఆనందం దొరుకుతోంది, ఇకపై ప్రతీ పండగకీ నేనుంటానన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ చినబాబు, డాక్టర్‌ ప్రమీల, తానా ట్రస్టీ విద్య గారపాటి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని