Gopichand: మారుతి చిత్రం అంటే నవ్వులు ఖాయం

‘‘సరదాగా చేసినా... ఇందులో ఓ సీరియస్‌ అంశం ఉంది. ‘మంచి రోజులు వచ్చాయి’ చూసి ప్రేక్షకులు కచ్చితంగా నవ్వుతారు. సినిమాని ఆస్వాదిస్తార’’న్నారు ప్రముఖ  దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌, మెహ్రీన్‌

Updated : 31 Oct 2021 05:44 IST

‘‘సరదాగా చేసినా... ఇందులో ఓ సీరియస్‌ అంశం ఉంది. ‘మంచి రోజులు వచ్చాయి’ చూసి ప్రేక్షకులు కచ్చితంగా నవ్వుతారు. సినిమాని ఆస్వాదిస్తార’’న్నారు ప్రముఖ దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌, మెహ్రీన్‌ జంటగా నటించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. వి సెల్యూలాయిడ్‌ సంస్థతో కలిసి ఎస్‌.కె.ఎన్‌ నిర్మించారు. నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ప్రముఖ కథానాయకుడు గోపీచంద్‌, నిర్మాత అల్లు అరవింద్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గోపీచంద్‌ మాట్లాడుతూ ‘‘మారుతి చిత్రం అంటే నవ్వులు ఖాయం. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘‘కరోనా తర్వాత అందరూ తెలియకుండానే ఒక రకమైన భయంలోకి వెళ్లిపోతున్నారు. ఆ భయం మీద ఎందుకు సినిమా చేయకూడదు అనే ఆలోచన వచ్చింది. ఆ వెంటనే 20 రోజుల్లో కథ రాసి... 30 రోజుల్లో సినిమా తీశా. ముందు నా పేరు వేసుకోకూడదు అనుకున్నా. కానీ ఒక మంచి విషయం చెబుతున్నప్పుడు దాని ఫలితం మనమే తీసుకోవాలని అల్లు అరవింద్‌ సర్‌తో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నా’’ అన్నారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘సినిమా వాళ్లకి మంచి రోజులు రావడం అంటే ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చి ఆశీర్వదించడమే. నాకు ఓటీటీ సంస్థ ఉన్నా సినిమాని తెరమీదే చూడండని కోరుతున్నా. సంతోష్‌ శోభన్‌ ప్రతిభగల కథానాయకుడు. మెహ్రీన్‌ మంచి మనసున్న అమ్మాయి. స్టార్‌హీరోలు ముందుకొచ్చి చిన్న సినిమాల్ని ప్రోత్సహిస్తున్నారు. అది మంచి సంప్రదాయం’’ అన్నారు. సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ ‘‘నవంబర్‌ 4న థియేటర్లన్నీ నవ్వులతో నిండిపోవాలి. నా ప్రతిభని నమ్మి మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తున్న యు.వి.కాన్సెప్ట్స్‌కి జీవితాంతం రుణపడి ఉంటా’’ అన్నారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు