Updated : 17/10/2021 04:46 IST

MAA Elections: అన్నివిధాల సహకరిస్తాం

- తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా  ఎన్నికైన మంచు విష్ణు తన కార్యవర్గ సభ్యులతో శనివారం ప్రమాణస్వీకారం చేశారు. 2021-23 సంవత్సరాలకుగాను ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ మొదట అధ్యక్షుడిగా మంచు విష్ణు, ఆ తర్వాత కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. జనరల్‌ సెక్రటరీగా   గెలిచిన రఘుబాబు ఆలస్యంగా హాజరయ్యారు. ఈసీ సభ్యుడిగా గెలిచిన సంపూర్ణేశ్‌ బాబు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యాడు. ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫి మంత్రి తలసాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీనియర్‌ నటులు మోహన్‌ బాబుతోపాటు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, నిర్మాతలు సి.కల్యాణ్‌,   చదలవాడ శ్రీనివాసరావు, తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ సహా పలువురు చిత్ర ప్రముఖులు హాజరై మా నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.... ‘‘అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల స్థాయిలో మా ఎన్నికలు జరిగాయి. మంచు విష్ణులాంటి యువకుడిని, ప్యానెల్‌ని ఎన్నుకున్న మా సభ్యులందరికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఎదుటివారితో ఎలా సంస్కారంగా ఉండాలో మోహన్‌ బాబు విష్ణుకు నేర్పించారు. మోహన్‌ బాబుకి కోపం ఎక్కువ అని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్పుకొంటారు. నిజం చెప్పాలంటే ఆ కోపంతో ఆయన ఎంతో నష్టపోయాడు. విష్ణుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుంది. సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ హబ్‌గా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించారు. చిత్రీకరణలకు అనువుగా ఉండే ఎన్నో ప్రదేశాలు మన తెలంగాణలో ఉన్నాయి. అందులోనూ రామోజీఫిల్మ్‌ సిటీ ఓ అద్భుతమైన కళాఖండం. మా ఎన్నికల్లో విష్ణు గెలుస్తాడని నాకు 10 రోజుల ముందే తెలుసు’’ అన్నారు. మోహన్‌ బాబు మాట్లాడుతూ... ‘‘మా’ అనేది కళాకారుల వేదిక. ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు. మా అధ్యక్షుడిగా ప్రతి విషయంలో విష్ణు ఆచితూచి వ్యవహరించాలి. సభ్యుల ఇళ్ల నిర్మాణం, వాళ్ల సమస్యల పరిష్కారం కోసం త్వరలో నేనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గరకు వెళ్లి  అడుగుతాను. అలాగే ఏపీ సీఎం జగన్‌నూ కలుస్తాం’’ అన్నారు. మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘‘ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ సభ్యులు రాజీనామా చేయడం దురదృష్టకరం. మేనిఫెస్టోలో చర్చించిన ప్రతిదీ అమలు జరిగేలా కృషి చేస్తాను. ఇకపై నేను, మా సభ్యులు ఎన్నికల వ్యవహారంపై మీడియాతో మాట్లాడరు’’ అని మంచు విష్ణు వివరించారు. ‘మా’ పూర్వ అధ్యక్షుడు నరేష్‌ మాట్లాడుతూ.... ‘‘మేనిఫెస్టోను విష్ణు సంపూర్ణంగా అమలు చేస్తాడు. పదవుల కోసం కాకుండా బాధ్యతల కోసం విష్ణు వెంట ఉంటా’’ అన్నారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని