Vijay devarakonda: ‘లైగర్‌’ ఆట.. షణ్ముఖ పాట

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనన్యా పాండే కథానాయిక. ఈ సినిమాలో ఇండియన్‌

Updated : 07 Sep 2021 06:15 IST

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘Liger’. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనన్యా పాండే కథానాయిక. ఈ సినిమాలో ఇండియన్‌ ఐడల్‌ ఫేమ్‌ షణ్ముఖ ప్రియతో ఓ పాట పాడించారు విజయ్‌. ఆయన ఇటీవల  ఇండియన్‌ ఐడల్‌ ఫైనల్‌ కార్యక్రమం సందర్భంగా షణ్ముఖకి శుభాకాంక్షలు చెబుతూ.. తన తదుపరి చిత్రంలో పాడే అవకాశమిస్తానని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ఇప్పుడాయన ‘లైగర్‌’లో ఆమెతో ఓ పాట పాడించి తన హామీ నెరవేర్చుకున్నారు. అంతేకాకుండా షణ్ముకను, ఆమె తల్లిని తన నివాసంలో కలిసి సత్కరించారు. కరోనా పరిస్థితులతో చిత్రీకరణ దశలో ఆగిన ఈ సినిమా త్వరలో గోవాలో పునఃప్రారంభం కానుంది. విజయ్‌ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైటర్‌గా కనిపించనున్నారు. కూర్పు: జునైద్‌ సిద్ధిఖీ, ఛాయాగ్రహణం: విష్ణు శర్మ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని