దయచేసి నాకు కాల్‌ చేయకండి: వాంగ్‌చుక్‌

చైనాతో వివాదం నేపథ్యంలో ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌సహా 59 చైనా యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది. అయితే అంతకుముందు నుంచే చైనా యాప్స్‌ను నిషేధించాలంటూ ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ సోషల్‌మీడియా వేదికగా ఉద్యమం మొదలుపెట్టారు. వారంలో

Updated : 30 Jun 2020 23:32 IST

చైనా యాప్స్‌ నిషేధంపై ఉద్యమకర్త‌ స్పందన

చైనాతో వివాదం నేపథ్యంలో ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌సహా 59 చైనా యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది. అయితే అంతకుముందు నుంచే చైనా యాప్స్‌ను నిషేధించాలంటూ ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ సోషల్‌మీడియా వేదికగా ఉద్యమం మొదలుపెట్టారు. వారంలో చైనా సాఫ్ట్‌వేర్‌ను‌.. ఏడాదిలో చైనా హార్డ్‌వేర్‌ను తొలగించాలని నెటిజన్లను కోరారు. తాజాగా ప్రభుత్వమే ఆ యాప్స్‌ను నిషేధించడంతో సోనమ్‌ వాంగ్‌చుక్‌ను అభినందించడానికి, మాట్లాడటానికి వేల కాల్స్‌ వస్తున్నాయట. దీంతో ఈ విషయంపై వాంగ్‌చుక్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘‘59 యాప్స్‌ నిషేధం విషయంలో నాకు మీడియా సంస్థల నుంచి వరదలా కాల్స్‌ వస్తున్నాయి. కానీ మీరు రాంగ్‌ నంబర్‌కు ఫోన్‌ చేస్తున్నారు. ఇందులో ఏదైనా ఘనత ఉందంటే.. అది దేశంలో ఉన్న వందకోట్లకుపైగా ఉన్న ప్రజలది.. ప్రభుత్వానిదే. కాబట్టి పాత్రికేయ మిత్రులారా నాకు దయచేసి కాల్‌ చేయకండి’’అని సోనమ్‌ వాంగ్‌చుక్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. తన స్పందనని వీడియో రూపంలో జత చేశారు.

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని