Thank You: తుది అంకంలో.. ‘థ్యాంక్‌ యూ’

సంక్రాంతికి ‘బంగార్రాజు’ సినిమాతో వచ్చి ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు నాగచైతన్య. ఇప్పుడు ‘థ్యాంక్‌ యూ’ను పూర్తి చేసేందుకు తిరిగి సెట్స్‌లోకి అడుగు పెట్టారు.

Updated : 23 Jan 2022 07:07 IST

సంక్రాంతికి ‘బంగార్రాజు’ సినిమాతో వచ్చి ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు నాగచైతన్య. ఇప్పుడు ‘థ్యాంక్‌ యూ’ను పూర్తి చేసేందుకు తిరిగి సెట్స్‌లోకి అడుగు పెట్టారు. విక్రమ్‌ కె.కుమార్‌ తెర కెక్కిస్తున్న చిత్రమిది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, అవికాగోర్‌, మాళవిక నాయర్‌ కథానాయికలు. ఈ చిత్ర ఆఖరి షెడ్యూల్‌ను తాజాగా ప్రారంభించారు. ఈ విషయాన్ని ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్‌ ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా సెట్లో నుంచి చైతూకి సంబంధించిన ఓ లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలో చైతన్య హాకీ స్టిక్‌ పట్టుకుని తన టీమ్‌తో కలిసి సంబరాలు చేసుకుంటున్నట్లుగా కనిపించారు. విభిన్నమైన ప్రేమ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో నాగచైతన్య మూడు భిన్నమైన లుక్‌లలో కనిపించనున్నారు. ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి కథ: బి.వి.ఎస్‌.రవి, మాటలు: వెంకీ, మిథున్‌ చైతన్య.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని