‘గెహ్రాహియా’ ట్రైలర్‌: హాట్‌హాట్‌ సన్నివేశాల్లో దీపిక-సిద్ధాంత్‌

బాలీవుడ్‌ నటులు దీపికా పదుకొణె- సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్యా పాండే- ధైర్యా కర్వా కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్‌ చిత్రం ‘గెహ్రాహియా’.

Published : 20 Jan 2022 18:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటులు దీపికా పదుకొణె- సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్యా పాండే- ధైర్యా కర్వా కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్‌ చిత్రం ‘గెహ్రాహియా’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ వేదికగా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘గెహ్రాహియా’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రేమ, స్నేహం, వ్యక్తిగత సంబంధాల వాటి పరిణామాల చుట్టూ కథను తీర్చిదిద్దాడు దర్శకుడు షకున్‌ బత్రా. అలిషా, జైన్‌ అనే జంట ప్రయాణమే ‘గెహ్రాహియా’ కథ. దీపిక-సిద్ధాంత్‌ ప్రణయ సన్నివేశాలతో సినిమాను హాట్‌హాట్‌గా తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. నసీరుద్దీన్‌ షా, రాజాత్‌ కపూర్‌ కీలక పాత్రలు పోషించారు. సుమిత్‌ రాయ్‌ కథ అందించగా.. కరణ్‌ జోహర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ధర్మా ప్రొడక్షన్స్‌ హౌస్‌ నిర్మిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని