Bollywood: ప్రేయసి కోసం రూ.23 కోట్లు
బాలీవుడ్ లవ్ బర్డ్స్ అర్జున్‌కపూర్-మలైకా అరోరా మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు. తన ప్రేయసి మలైకాకు అత్యంత చేరువలో ఉండాలనే ఉద్దేశంతో అర్జున్‌కపూర్ బాంద్రాలో..
విల్లా కొనుగోలు చేసిన అర్జున్ కపూర్
ముంబయి: బాలీవుడ్ లవ్ బర్డ్స్ అర్జున్‌కపూర్-మలైకా అరోరా మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు. తన ప్రేయసి మలైకాకు అత్యంత చేరువలో ఉండాలనే ఉద్దేశంతో అర్జున్‌కపూర్ బాంద్రాలో ఓ సరికొత్త విల్లాను కొనుగోలు చేశారట. ప్రస్తుతం తన సోదరితో కలిసి ముంబయిలోని ఓ ప్రాంతంలో నివాసముంటున్న అర్జున్‌కపూర్ తాజాగా బాంద్రాలో ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోలందరూ నివాసం ఉండే బాంద్రా ప్రాంతంలో గల ఈ విల్లా కోసం అర్జున్ సుమారు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. మరోవైపు, ఆయన కొనుగోలు చేసిన ఈ ఇల్లు.. మలైకా అరోరా ఉంటున్న ఇంటికి అతి తక్కువ దూరంలోనే ఉంటుందట.
అర్జున్‌కపూర్-మలైకా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వయసు పరంగా చూసుకుంటే అర్జున్‌కపూర్ కంటే మలైకా అరోరా 12 సంవత్సరాలు పెద్దది. దీంతో వీరిద్దరి రిలేషన్ గురించి వార్తలు బయటకు వచ్చిన తరుణంలో అందరూ వీరి వయసు గురించే మాట్లాడుకున్నారు. వయసుతో తమకు సంబంధంలేదని.. ప్రేమానుబంధాలు ముఖ్యమని ఎన్నో సందర్భాల్లో ఈ జంట చెప్పింది కూడా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్‌లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్‌లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM