Akkineni Akhil : విరాట్‌ కోహ్లి బయోపిక్‌లో నటించాలనుంది: అఖిల్‌

టాలీవుడ్‌ హీరో అక్కినేని అఖిల్‌ కథానాయకుడిగా నటించిన  ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ దసరా కానుకగా.. ఈనెల 15న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర ప్రచారాల్లో పాల్గొన్న ఆయన  ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో బయోపిక్స్‌పై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించాడు.

Updated : 14 Oct 2021 07:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ హీరో అక్కినేని అఖిల్‌ కథానాయకుడిగా నటించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ దసరా కానుకగా ఈనెల 15న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర ప్రచారాల్లో పాల్గొన్న ఆయన ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో బయోపిక్స్‌పై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించాడు. ముఖ్యంగా స్పోర్ట్స్‌ బయోపిక్స్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ స్పోర్ట్స్‌ బయోపిక్స్‌ తెరకెక్కించడమనేది అంత తేలికైన విషయం కాదు. క్రికెట్‌, హార్స్‌ రైడింగ్‌.. ఇలా ఏదైనా క్రీడానేపథ్యంలో బయోపిక్స్‌ను తీయొచ్చు అనుకుంటాం.  కాకపోతే వాటికి బలమైన కథ ఉంటే తప్ప... ఆ క్రీడ హైలైట్‌ కాదు. అయితే ఇప్పటి వరకూ నా వరకూ అలాంటి బలమైన స్ర్కిప్ట్స్‌ రాలేదు’’ అన్నాడు అఖిల్‌.

ఆయనలో ఆ ఫైర్‌ ఇష్టం
‘‘భారత క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన జీవితమంటేనే ఒక తపన, అంకితభావం. ఏదో ఒకటి సాధించాలనే ఫైర్‌ విరాట్లో ఉంటుంది. ఎన్నో విధాలుగా ఆయన నా జీవితం మీద ప్రభావం చూపారు. అందుకే విరాట్ కోహ్లి బయోపిక్‌లో నటించాలనుంది. ఏదో రోజు ఆ అవకాశం వస్తే బాగుంటుందని ఆశిస్తున్నా. టీమిండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌ జీవితాధారంగా.. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా రూపొందించిన ‘83’ చిత్రం  కోసం ఎదరుచూస్తున్నా. ఇలాంటి స్క్రిప్ట్‌ నన్ను ఉత్తేజపరుస్తాయి. వెండితెరపై ఈ సినిమా మెప్పిస్తుందని ఆశిస్తున్నా’’ అని అఖిల్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని