సీటీకొట్టి చూపిద్దాం...

గోపీచంద్‌ కథానాయకుడిగా... సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీటీమార్‌’. తమన్నా కథానాయిక. భూమిక, దిగంగన సూర్యవన్షీ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

Updated : 05 Sep 2021 08:03 IST

గోపీచంద్‌ కథానాయకుడిగా... సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీటీమార్‌’. తమన్నా కథానాయిక. భూమిక, దిగంగన సూర్యవన్షీ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 10న విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందిన చిత్రమిది.  వినాయక చవితి సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా పండగకి కుటుంబమంతా కలిసి ఆస్వాదించేలా ఉంటుంది. వాణిజ్యాంశాల్ని పక్కాగా మేళవించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకి, ట్రైలర్‌కి మంచి స్పందన లభించింది. ట్రైలర్‌లో కథానాయకుడు సీటీ కొట్టి చూపిద్దాం అన్నట్టుగానే, తప్పకుండా చిత్రం ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుంది’’ అన్నారు. సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: ఎస్‌.సౌందర్‌రాజన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని