విష్ణు రథం ఎక్కుతున్నా

‘‘మంచు విష్ణు అందరికీ అందుబాటులో ఉంటాడు. ‘మా’ అధ్యక్షుడిగా అతను సరైనవాడు. ‘మా’ కోసం నేను విష్ణు రథం ఎక్కుతున్నా. నాది కృష్ణుని పాత్ర’’ అన్నారు నటుడు, ‘మా’ అధ్యక్షుడు వి.కె.నరేశ్‌. త్వరలో జరగనున్న ఎన్నికల్లో

Updated : 30 Sep 2021 07:18 IST

‘‘మంచు విష్ణు అందరికీ అందుబాటులో ఉంటాడు. ‘మా’ అధ్యక్షుడిగా అతను సరైనవాడు. ‘మా’ కోసం నేను విష్ణు రథం ఎక్కుతున్నా. నాది కృష్ణుని పాత్ర’’ అన్నారు నటుడు, ‘మా’ అధ్యక్షుడు వి.కె.నరేశ్‌. త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న విష్ణు ప్యానెల్‌తో కలిసి నరేష్‌ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘తెలుగు పరిశ్రమలో అన్ని భాషలవాళ్లూ పనిచేస్తారు. కానీ ఇంటి యజమానిగా పరిశ్రమని తెలుగువాళ్లే నడపాలి. తెలుగువాళ్ల కోసం నిర్మించుకున్న ఈ సంఘంలో సభ్యులుగా ఎవరైనా ఉండొచ్చు. ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా పోటీ చేస్తానంటే ప్రాతినిధ్యం ఇద్దాం. కానీ అధ్యక్షుడి స్థానంలో తెలుగువాళ్లు ఉండాలని చెబుతాను. ఆ పదవి కోసం సమర్థులు ఎవరూ లేరన్న మాటని ప్రకాశ్‌రాజ్‌ వెనక్కి తీసుకోవాలి. మా ప్యానెల్‌ అజెండా సంక్షేమం. మరి మీదేంటో చెప్పాలి’’ అన్నారు.


మా నామినేషన్లు పూర్తి

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, విష్ణు మంచు, సీవీఎల్‌ నరసింహారావు, కె.శ్రావణ్‌కుమార్‌ నామినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ తెలిపారు. ప్రధాన కార్యదర్శి పదవికోసం ముగ్గురు, ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షులుగా ఇద్దరు, ఉపాధ్యక్షులుగా నలుగురు, సహాయ కార్యదర్శులుగా ఐదుగురు, కోశాధికారిగా ఇద్దరు, కార్యవర్గ సభ్యులుగా 41 మంది పోటీలో నిలిచారని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని