NISChay: డ్యాన్స్‌ చేసిన చిరు,అరవింద్‌ దంపతులు

నటుడు నాగబాబు కుమార్తె, కొణిదెల వారసురాల్లో ఒకరైన నిహారిక వివాహ వేడుకలు ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌రావు తనయుడు చైతన్యతో నిహారిక బుధవారం రాత్రి 7.15 గంటలకు ఏడడుగులు వేయనున్నారు....

Updated : 15 Dec 2022 16:25 IST

నిహారిక మెహందీ వేడుకల్లో ఆకట్టుకునే విశేషాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు నాగబాబు కుమార్తె, కొణిదెల వారసురాలు నిహారిక వివాహ వేడుకలు ఉదయ్‌‌పూర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. గుంటూరు మాజీ ఐజీ జె. ప్రభాకర్‌రావు తనయుడు చైతన్యతో నిహారిక బుధవారం రాత్రి 7.15 గంటలకు ఏడడుగులు వేయనున్నారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌ హోటల్‌లో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి సంగీత్‌.. మంగళవారం మెహందీ వేడుకలు‌ ప్రతి ఒక్కర్నీ ఆకర్షిస్తున్నాయి.

కాగా, సంగీత్‌ వేడుకల్లో మెగా, అల్లు కుటుంబాలకు చెందిన యువ హీరోలందరూ కలిసి స్టేజ్‌పై స్టెప్పులేసి ఎంజాయ్‌ చేయగా.. తాజాగా, మెహందీ సెలబ్రేషన్స్‌లో మరికొన్ని అందమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఓవైపు పవన్‌కల్యాణ్‌ తన తనయుడు అకీరాతో వేడుకల్లో తళుక్కున మెరిశారు. మరోవైపు బన్నీ, చిరు-సురేఖ దంపతులు ‘బంగారు కోడిపెట్టా’ పాటకు స్టెప్పులేయగా.. అల్లు అరవింద్‌-నిర్మల దంపతులు ‘రామా చిలకమ్మ’ పాటకు డ్యాన్స్‌ చేశారు. అంతేకాకుండా ‘గ్యాంగ్‌లీడర్‌’ పాటకు నాగబాబు, నిహారిక-చైతన్య డ్యాన్స్‌ చేసి మెప్పించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సదరు వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. నిహారిక మెహందీ వేడుకల్లో చోటుచేసుకున్న అందమైన క్షణాలను మీరూ ఓ సారి చూసేయండి..!

ఇవీ చదవండి

వేడుకగా నిహారిక మెహందీ సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

పవన్‌ అకీరా సేమ్‌ టు సేమ్‌

నిహారిక సంగీత్‌.. వైరల్‌ వీడియోలు

 





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని