క్వారంటైన్‌లో నటుడితో ఉన్నాను..

‘ఛయ్యా ఛయ్యా' సాంగ్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు నటి మలైకా అరోడా. మొదటి సాంగ్‌తోనే మెప్పించిన ఆమె నటిగానే కాకుండా డ్యాన్సర్‌గా కూడా ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు బిజినెస్‌ వుమెన్‌గా రాణిస్తున్నారు. అయితే, మలైకా గతకొన్ని సంవత్సరాల...

Published : 27 Dec 2020 16:50 IST

పేరు మాత్రం చెప్పలేదు

ముంబయి: ‘ఛయ్యా ఛయ్యా' సాంగ్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు నటి మలైకా అరోడా. మొదటి సాంగ్‌తోనే మెప్పించిన ఆమె నటిగానే కాకుండా డ్యాన్సర్‌గా కూడా ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు బిజినెస్‌ వుమెన్‌గా రాణిస్తున్నారు. అయితే, మలైకా గతకొన్ని సంవత్సరాల నుంచి బాలీవుడ్‌ కథానాయకుడు అర్జున్‌ కపూర్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. సోషల్‌మీడియా వేదికగా తమ ప్రేమ గురించి  ఎన్నో సందర్భాల్లో ఈ జంట బయటపెట్టింది. అయితే, సెప్టెంబర్‌ నెలలో కరోనా బారినపడిన మలైకా అరోడా, అర్జున్‌కపూర్ ఇటీవల కోలుకున్నారు.

కాగా, తాజాగా మలైకా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా బారినపడిన సమయంలో అర్జున్‌తో కలిసి క్వారంటైన్‌లో ఉన్నట్లు పరోక్షంగా తెలిపారు. ‘మీకు ఒకవేళ ఛాన్స్‌ వస్తే ఏ నటుడితో కలిసి క్వారంటైన్‌లో ఉండాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నించగా.. ‘నిజం చెప్పాలంటే నిజ జీవితంలోనే ఓ నటుడితోనే క్వారంటైన్‌లో ఉన్నాను. అతను చాలా మంచి వ్యక్తి. ఒకవేళ ఛాన్స్‌ వస్తే అతనితోనే నిర్బంధంలో ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే అతను ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌ పర్సన్‌. అతనితో ఉంటే ప్రతి క్షణం ఎంతో ఉత్సాహంగా గడుస్తుంది.’ అని మలైకా తెలిపారు. అయితే ఆమె నటుడి పేరు బయటపెట్టనప్పటికీ.. ఆ వ్యక్తి అర్జున్‌కపూరే అని అందరూ చెప్పుకుంటున్నారు.

ఇదీ చదవండి
‘నాన్నే నా స్ఫూర్తి’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని