The Railway Men: వెబ్‌ సిరీస్‌గా రానున్న 1984 భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన.. ఆర్‌. మాధవన్‌ హీరో

‘‘ కొన్ని కథలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ఒకటి 1984లో జరిగిన భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన’’ అని అన్నారు ప్రముఖ నటుడు ఆర్‌. మాధవన్‌. 37ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) పెస్టిసైడ్‌ ప్లాంట్‌లో మిథైల్ ఐసోసనియేట్ రసాయనం లీకై సుమారు 3,800 మంది చనిపోయగా.. 5లక్షల మందికిపైగా గాయాలపాలయ్యారు.

Updated : 03 Dec 2021 09:24 IST

‘ది రైల్వే మెన్‌’ పేరుతో విడుదల

ఇదే యశ్‌రాజ్‌ ఫిల్మ్‌ తొలి ఓటీటీ సిరీస్‌ 

ఇంటర్నెట్ డెస్క్‌: ‘‘ కొన్ని వాస్తవ సంఘటనలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ఒకటి 1984లో జరిగిన భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన’’ అని అన్నారు ప్రముఖ నటుడు ఆర్‌. మాధవన్‌. 37ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) పెస్టిసైడ్‌ ప్లాంట్‌లో మిథైల్ ఐసోసనియేట్ రసాయనం లీకై సుమారు 3,800 మంది చనిపోయగా.. 5లక్షల మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన పారిశ్రామిక విపత్తుగా పరిగణించిన ఈ ఘటన... ఇప్పుడు వెబ్‌సిరీస్‌ రూపంలో ‘‘ ది రైల్వే మెన్- ది అన్‌టోల్డ్‌ స్టోరీ‌’’ పేరుతో రానుంది. బుధవారం ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు మాధవన్‌. ‘‘ 37ఏళ్ల క్రితం భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనలో ప్రాణాలు అర్పించిన రైల్వే ఉద్యోగులకు ఈ చిత్రంతో నివాళి అర్పిస్తున్నాం. యశ్‌రాజ్‌ తొలి ఓటీటీ ప్రాజెక్ట్‌ అయిన ఇందులో నటించడం గర్వంగా ఉంది. 2022 డిసెంబర్‌2న విడుదల చేయనున్నాం’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని