Most Expensive Cities: ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన నగరమేదో తెలుసా?

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవివ్‌ నగరం నిలిచింది. పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(ఈఐయూ) అనే సంస్థ అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. ఆగస్టు.. సెప్టెంబర్‌ నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లో ఉన్న నిత్యావసర

Updated : 24 Nov 2022 15:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవివ్‌ నగరం నిలిచింది. పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) అనే సంస్థ అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు, అద్దె, రవాణా తదితర వ్యయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ జాబితాలో తొలిసారిగా టెల్‌ అవివ్‌ మొదటిస్థానంలో నిలవడం విశేషం. పారిస్‌(ఫ్రాన్స్‌), సింగపూర్‌ సమాన పాయింట్లతో రెండో స్థానాన్ని పంచుకున్నాయి. జ్యూరిచ్‌ (స్విట్జర్లాండ్‌) నాలుగో స్థానంలో, హాంకాంగ్‌ ఐదో స్థానంలో నిలిచాయి. ఇక ఆరో స్థానంలో న్యూయార్క్‌ (యూఎస్‌), ఏడో స్థానంలో జెనీవా (స్విట్జర్లాండ్‌), ఎనిమిదో స్థానంలో కోపెన్‌హాగెన్‌ (డెన్మార్క్‌), తొమ్మిదో స్థానంలో లాస్‌ ఏంజెలెస్‌ (యూఎస్‌), పదో స్థానంలో ఒసాకా (జపాన్‌) ఉన్నాయి.

గతేడాది పారిస్‌, జ్యూరిచ్‌, హాంకాంగ్‌ నగరాలు అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. అయితే, ద్రవ్యోల్బణం ప్రభావం.. కరోనా కారణంగా నిత్యావసర సరఫరాలో ఇబ్బందులతో కొన్ని దేశాల్లో ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. గతంతో పోలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు స్థానిక కరెన్సీలోనే 3.5 శాతం పెరిగినట్లు ఈఐయూ సర్వేలో తేలింది. దీంతో గతంలో 79వ స్థానంలో ఉన్న ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ కూడా 29వ స్థానానికి ఎగబాకింది. దీన్ని బట్టి గతేడాది కంటే ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయాలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, అత్యల్ప జీవన వ్యయమున్న నగరంగా సిరియాలోని డమాస్కస్‌ నిలిచింది.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని