Maharashtra: పులుల గణన కోసం వెళ్లి.. పులి దాడిలో మహిళా ఉద్యోగి మృతి

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో ఘోరం జరిగింది. పులుల గణన కోసం అడవిలోకి వెళ్లిన ఓ మహిళా ఉద్యోగిపై పులి దాడి చేసి చంపేసింది. తడోబా అభయారణ్యంలో

Published : 20 Nov 2021 11:35 IST

చంద్రాపూర్‌: మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో ఘోరం జరిగింది. పులుల గణన కోసం అడవిలోకి వెళ్లిన ఓ మహిళా ఉద్యోగిపై పులి దాడి చేసి చంపేసింది. తడోబా అభయారణ్యంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 

తడోబా అభయారణ్యంలో గత కొద్ది రోజులుగా అటవీశాఖ అధికారులు పులుల గణన చేపట్టారు. ఈ పనుల నిమిత్తం సోమవారం కొంతమంది అటవీశాఖ సిబ్బంది, అటవీ కూలీలు కోలారా గేట్‌ వద్ద ఉన్న 97వ కోర్‌ జోన్‌కు వెళ్లారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఓ పులి వారిపై దాడి చేసింది. అటవీశాఖ మహిళా ఉద్యోగి స్వాతి ధోమనే(43)పై దాడి చేసి ఆమెను పొదల్లోకి లాక్కెళ్లింది. అటవీ శాఖ కూలీలు వెంబడించినప్పటికీ పులి ఆమెను వదిలిపెట్టలేదు. సమాచారమందుకున్న తడోబా మేనేజ్‌మెంట్‌ అధికారి, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. అభయారణ్యంలోని దట్టమైన పొదల ప్రాంతంలో స్వాతి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని