Updated : 04/11/2021 17:38 IST

Pak: శాంతి వద్దు.. ఆట కావాలి..!

 భారత్‌తో సంబంధాలపై పాక్‌ తీరు..

 ఇంటర్నెట్‌డెస్క్‌ : ఇటీవల భారత్‌తో టీ20 మ్యాచ్‌ తర్వాత పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సౌదీలోని ఏఆర్‌వై న్యూస్‌తో మాట్లాడుతూ ‘‘భారత్‌తో క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లాలి. భారత్‌తో ఇస్లామాబాద్‌ మంచి సంబంధాలు కోరుకుంటోంది’’ అని వ్యాఖ్యానించారు. కానీ, చేతల్లో మాత్రం పాక్‌ ఇరు దేశాల సంబంధాల అభివృద్ధికి ఏమీ చేయడంలేదు. అఫ్గానిస్థాన్లో ఐసిస్‌ వ్యాప్తి వంటి ఆందోళనకర పరిణామాలపై చర్చించేందుకు దిల్లీలో వచ్చేవారం పలు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు సమావేశం కానున్నారు. తాను ఈ సమావేశంలో పాల్గొనడంలేదని పాక్‌ ఎన్‌ఎస్‌ఏ మొహిద్‌ యూసఫ్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సమావేశంలో పాల్గొనాలని రష్యా,కిర్గిస్థాన్‌, కజకిస్థాన్‌, తజకిస్తాన్‌, ఇరాన్‌, ఉజ్బెకిస్థాన్‌,పాకిస్థాన్‌,చైనాకు ఆహ్వానాలు వెళ్లాయి. చైనా కూడా ఇప్పటివరకు పాల్గొనేదీ లేనిది చెప్పలేదు. 

నిన్న ఉజ్బెకిస్థాన్‌ ఎన్‌ఎస్‌ఏతో భేటీ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాక్‌ ఎన్‌ఎస్‌ఏ యూసఫ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా అఫ్గానిస్థాన్‌ వినాశనం సృష్టించిన దేశంగా భారత్‌ను అభివర్ణించారు. ‘వినాశకులు ఎప్పటికీ శాంతినితెచ్చే వారు కాదు’ అని వ్యాఖ్యానించారు. భారత్‌ విషయంలో ప్రపంచ దేశాలు కళ్లుమూసుకొని వ్యవహరిస్తున్నాయని విషపు వ్యాఖ్యలు చేశారు.

మరోపక్క తాలిబన్లను గుర్తించే విషయంలో భారత్‌ స్థిరంగా వ్యవహరిస్తోంది. అఫ్గానిస్థాన్‌ భూభాగం భారత వ్యతిరేక ఉగ్రమూకల అడ్డాగా మారకుండా చూడాలని తాలిబన్లను కోరింది. కానీ, ఆ దిశగా తాలిబన్లు ప్రోత్సాహకర చర్యలు తీసుకొన్నట్లు కనిపించడంలేదు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని