White House: బైడెన్‌ సర్కారు కీలక విషయాలు కప్పిపెడుతోందా..?

శ్వేత సౌధం అఫ్గాన్‌ నుంచి అమెరికన్ల తొలగింపు విషయంలో అనుమానాస్పందంగా ప్రవర్తిస్తోంది. శ్వేత సౌధం ప్రతినిధి

Published : 09 Sep 2021 17:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్వేత సౌధం అఫ్గాన్‌ నుంచి అమెరికన్ల తరలింపు విషయంలో బైడెన్‌ సర్కారు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తోంది. శ్వేత సౌధ ప్రతినిధి జెన్‌సాకీ నిన్న విలేకర్లతో మాట్లాడుతున్న సమయంలో ఈ విషయం స్పష్టమైంది. అమెరికా మీడియాకు చెందిన కొందరు రిపోర్టర్లు అఫ్గానిస్థాన్‌లోని అమెరికన్ల పరిస్థితిపై ప్రశ్నించారు. తరలింపు అంశం ఎక్కడ వరకు వచ్చింది..? ఎక్కడ నిలిచిపోయింది..? దీనిపై మీకు తెలిసిన సమాచారం ఏమిటీ..? తాలిబన్లు అడ్డుకొంటున్నారా..? అని ప్రశ్నించారు. దీనికి జెన్‌సాకీ నేరుగా సమాధానం ఇవ్వలేదు. అతి తక్కువ మంది అమెరికన్లు.. కొన్ని ఛార్టెడ్‌ విమానాలు అక్కడే ఉన్నాయని చావుకబురు చల్లగా చెప్పారు. అంతేకాదు వారిని ప్రయాణించడానికి తాలిబన్లు అనుమతించడంలేదని వివరించారు. అమెరికన్లను బందీలుగా పట్టుకోవడంతో దీనిని పోల్చలేనని చెప్పారు. వారిలో కొందరికి  ప్రయాణ పత్రాల విషయంలో సమస్యలు ఉన్నాయన్నారు. ఈ పరిస్థితి తలెత్తడంలో ఎవరిది తప్పు..?  అని ఒక విలేకరి ఆమెను ప్రశ్నించారు. దీనికి సాకీ స్పందిస్తూ.. ఇక్కడ తప్పుజరిగిందని తాను అనుకోవడంలేదని చెప్పారు. 

బ్లింకన్‌ కూడా అదే భాష..

బుధవారం అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ ఒక ఛానెల్‌తో మాట్లాడారు.‘‘ తాలిబన్లు ఛార్టెడ్‌ విమానాలు బయల్దేరేందుకు అనుమతించడంలేదు. అక్కడున్న వారిలో కొందరికి సరైన పత్రాలు లేవని చెబుతున్నారు. మాకు అక్కడ సిబ్బంది లేరు. మాకు పరిమితులు ఉన్నాయి. కానీ, అక్కడి నుంచి విమానాలు, మనుషలను తరలించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నామని నమ్మకంగా చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని